ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిలువరించడానికి అనేక దేశాలు ఆంక్షల బాట పట్టాయి. రష్యా వెంటనే యుద్ధాన్ని విరమించాలని కోరాయి. అంతేకాదు, ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తూ సహకరిస్తున్నాయి. అయితే, ఉక్రెయిన్ ఇతర దేశాల నుంచి వాలంటరీ రూపంలో పోరడటానికి ముందుకు రావాలని కోరింది. ఈ విజ్ఞప్తికి స్పందిస్తూ.. 3000 మంది అమెరికన్లు రష్యా బలగాలపై ఉక్రెయిన్ తరఫున పోరాటానికి సిద్ధం అయినట్టు తెలిసింది.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని చాలా మంది వ్యక్తిగతంగానూ వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షల యుద్ధం ప్రకటించాయి. రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌లోని సామాన్యులు సైతం ఆయుధాలు చేతబూనిన సంగతి తెలిసిందే. చిన్నా పెద్ద తేడా లేకుండా గన్‌లు పట్టుకుని ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లోకి చేరిన రష్యా సైనికులనూ వారు ధైర్యంగా అడ్డుకునే ప్రయత్నాలు సోషల్ మీడియాలో చర్చను పెంచుతున్నాయి. అయితే, ఈ ప్రతిఘటన కేవలం ఉక్రెయిన్‌కే పరిమితం కావడం లేదు. రష్యా సేనలను అడ్డుకోవాలని ఇతర దేశాల్లోని సామాన్య పౌరులకూ బలంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఇతర దేశాల నుంచి స్వచ్ఛందంగా కదన రంగంలోకి దూకుతున్నారు. తాజాగా, 3000 మంది అమెరికన్లు స్వచ్ఛందంగా ఉక్రెయిన్ తరఫున యుద్ధంలో పాల్గొని రష్యాపై పోరాడటానికి సిద్ధం అయ్యారు.

రష్యా బలగాలపై పోరాడటానికి విదేశీ వాలంటీర్లు ఉక్రెయిన్‌కు సహకరించాలని ఉక్రెయిన్ అధికారులు విజ్ఞప్తులు చేశారు. ఈ విజ్ఞప్తులకు 3000 మంది అమెరికన్లు స్పందించారు. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలపై పోరాడటానికి మూడు వేల మంది అమెరికన్లు రెడీ అయ్యారని వాషింగ్టన్‌లోని కీవ్ ఎంబస్సీ పేర్కొన్నట్టు ఓ వార్తా కథనం తెలిపింది.

రష్యా దాడిని అరికట్టడానికి అనేక దేశాలు ఆంక్షల దారిని ఎంచుకున్నాయి. కానీ, అమెరికా వెనుకడుగు వేయలేదు. అదే విధంగా అనేక దేశాలు ఉక్రెయిన్‌కు పలు విధాల్లో సహకారం అందిస్తున్నాయి. ఆయుధాలు అందించి ఉక్రెయిన్ ఫోర్సెస్‌ను ఎదుర్కోవడానికి అమెరికా, యూకే, ఇతర దేశాలు ఉక్రెయిన్‌కు సహాయ హస్తం అందిస్తున్నాయి.

రష్యా బలగాలను ప్రతిఘటించడానికి అవసరమైన ఇంటర్నేషనల్ బెటాలియన్‌లో చేరడగానికి వాలంటీర్లు స్పందించారని వాషింగ్టన్‌లోని కీవ్ ఎంబసీ అధికారులు తెలిపారు. ఇతర దేశాల నుంచీ ఉక్రెయిన్‌ తరఫున పోరాడటానికి వాలంటీర్లు ముందుకు వస్తున్నారని వివరించారు. ముఖ్యంగా గతంలో సోవియట్ యూనియన్‌లో కలిసి ఉన్న జార్జియా, బెలారస్ వంటి దేశాల నుంచీ స్వచ్ఛందంగా వచ్చి ఉక్రెయిన్ తరఫున పోరడటానికి సిద్ధం అవుతుండటం గమనార్హం.

పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నా రష్యా అధినేత (russia president) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పుతిన్‌కు సొంతదేశంలోనే నిరసన సెగ ఎదురవుతున్నా.. బెలారస్ మాత్రం రష్యాకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం.. ఆ చిన్న దేశంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యాకు మద్దతు ఇస్తుందనే కారణంతో బెలారస్‌పై ఆంక్షల్ని విధించేందుకు సిద్ధమైనట్లు దక్షిణ కొరియా (south korea) ఆదివారం ప్రకటించింది. ఎలాంటి ఆంక్షలు విధించబోతున్న విషయాన్ని స్పష్టం చేయనప్పటికీ.. దాదాపుగా రష్యాపై విధించిన ఆంక్షల్నే బెలారస్‌పై (belarus) కూడా అమలు చేయనున్నట్లు సమాచారం. గత నెలలో రష్యాకు ఎగుమతులపై దక్షిణ కొరియా నియంత్రణలను కఠినతరం చేసింది.. అలాగే రష్యన్ బ్యాంకులతో లావాదేవీలను నిలిపివేసింది. ఈ వ్యవహారంపై దక్షిణ కొరియా మంత్రి ఒకరు తాజాగా మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి బెలారస్ మద్దతు ఇస్తోంది. దీంతో బెలారస్‌పై కూడా ఎగుమతి నియంత్రణ చర్యలను అమలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు.