Starbucks: ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'స్టార్‌బక్స్' కాఫీ కేఫ్ లో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అక్కడి సిబ్బంది చేసిన పని అందరి ప్రశంసలు అందుకుంటున్నది. అక్కడ అసలు ఏం జరిగింది? తెలుసుకుందాం పదండి.. !
Starbucks : ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'స్టార్‌బక్స్' కాఫీ కేఫ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ! ఎందుకంటే వారు తమ వినియోగదారులకు అందించే సేవలు నాణ్యమైనవిగా, మెరుగైనవిగా ఉంటాయి. ఇప్పుడు అక్కడి సిబ్బంది చేసిన ఓ పనికి సంబంధించిన ఘటన అందరి ప్రశంసలు అందుకుంటున్నది. ఈ చర్య ఇంకా సమాజంలో మానవత్వంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తుందని పలువురు పేర్కొంటూ ప్రశంసలు కూరిపిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. నేటి సమాజంలో ఒంటరిగా బయటకు వెళ్లిన తమవారికి ఎలాంటి సమస్యలు వస్తాయోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం సాధారణమే. ఎందుకంటే ప్రస్తుతం అనుకోని సంఘటనలు జరగడం.. తమవారికి ఇబ్బందులు కాలగడం నిత్యం చూస్తున్నాం. ఇక ఒంటరిగా బయటకు వచ్చిన యువతులు, మహిళల పరిస్థితులు చెప్పక్కర్లేదు. అపరిచితుల నుంచి వారికి ఇబ్బందులు ఎదురవుతున్న ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'స్టార్‌బక్స్' కాఫీ కేఫ్ కు ఒంటరిగా ఓ యువతి వెళ్లింది. అమ్మాయి టీనేజర్. అయితే, అక్కడ ఆ టీనేజర్ కూర్చుని ఉండగా.. ఒక అపరిచిత వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ టీనేజర్ అసౌకర్యానికి గురవుతున్నట్టు కనిపించింది. ఈ విషయంపై ఎవరి సాయం అడగలేదు. దీనిని గమనించిన స్టార్‌బక్స్ సిబ్బంది.. ఆ టీనేజర్‌కు ఒక కాఫీకప్ అందించారు. దానిపై మీరు బాగానే ఉన్నారా? మమ్మల్ని జోక్యం చేసుకోమంటారా? అంటూ చేతితో రాసిన పలు వ్యాఖ్యలు ఉన్నాయి.
స్టార్‌బక్స్ సిబ్బంది ఎక్స్‌ట్రా హాట్ చాక్లెట్ కప్ మీకోసం అంటూ.. దానిని ఆ టీనేజర్‌కు అందించారు. దానిపై ఇలా రాసి ఉంది: "మీరు బాగున్నారా? మేము జోక్యం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? మీరు అలా ఒకే చేస్తే, కప్పు మూత తీయండి" అని రాశారు. ఒంటరిగా ఉన్న బాలికను.. ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఆ టీనేజర్ ను సురక్షితంగా ఉంచడానికి స్టార్‌బక్స్ సిబ్బంది చేసిన ఈ చొరవ అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ ఘటనను ఆ టీనేజర్ తన తల్లికి వివరిస్తూ.. ఆ కప్పును చూపించింది. దీనిపై స్పందించిన ఆ టీనేజర్ తల్లి.. స్టార్‌బక్స్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. తన కుమార్తెను సురక్షితంగా ఉంచడానికి స్టార్‌బక్స్ సిబ్బంది ఇంత త్వరగా స్పందిస్తూ.. ఇలా ఆలోచించినందుకు ధన్యవాదాలు తెలిపింది.
దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన ఆ టీనేజర్ తల్లి... తన కూతురు హైస్కూల్ విద్యార్థిని అని తెలిపింది. తను దగ్గరి స్ట్రీట్ లో ఉన్న స్టార్‌బక్స్ కాఫీ కేఫ్ లో ఓ టేబుల్ పై కూర్చుని చదువుకుంటోంది. ఈ క్రమంలోనే తన కూతురు టెబుల్ దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి.. తాను ఏం చదువుతున్నదో చూసి.. దాని గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే వింతగా మాట్లాడటం ప్రారంభించాడు. దీనిని గమనించిన స్టార్‌బక్స్ సిబ్బంది.. ఒంటరిగా ఉన్న తన టీనేజ్ కూతురును సురక్షితంగా ఉంచడానికి స్పందించిన తీరు.. ఇంకా సమాజంలో మానవత్వంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. అక్కడి సిబ్బందికి కృతజ్ఙతలు తెలిపారు.
