వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశాడు. ఇటీవల ఓ మిడియా సంస్థ వచ్చే ఆదివారం ప్రసారం చేయబోయే ఇంటర్వ్యూకు సంబంధించిన ఫుటేజీలో కొంత భాగాన్ని విడుదల చేశారు. పూర్తి ఇంటర్వ్యూను కూడా విడుదల చేస్తానని సదరు సంస్థకు బెదిరించాడు. పక్షపాత దోరణితో వ్యవహరిస్తూ ఇంటర్వ్యూలో ఇబ్బందికర ప్రశ్నలను సంధించారని ట్రంప్ సోషల్ మీడియా వేదికన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''జర్నలిస్ట్ లెస్లీ స్టాల్ యొక్క పక్షపాతం, ద్వేషం మరియు మొరటుతనం చూడండి'' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను ఈ ట్వీట్ కు జతచేశాడు ట్రంప్.   

 

ట్రంప్‌ ఫేస్‌బుక్ పేజీ పోస్ట్ చేసిన రా ఫుటేజ్ ని చూస్తే నెట్‌వర్క్‌తో వైట్‌హౌస్ చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. మొదటి నుండి చివరి వరకు చూపించినట్లు కనిపిస్తోంది. ఇలా తనకు ఇబ్బంది కలిగేలా ప్రశ్నించడంతో అధ్యక్షుడు ట్రంప్ నిరాశ చెందినట్లున్నారు. 

ఇక ఇంటర్వ్యూ సందర్భంగా జర్నలిస్ట్ లెస్టీ స్టాల్ మాస్క్ లేకుండానే వైట్ హౌస్ లో తిరిగారంటూ ఓ ఫోటోను ట్రంప్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇలాంటివి చాలా వున్నాయని... వాటిని కూడా విడుతల చేస్తానని ట్రంప్ ప్రకటించారు.