Asianet News TeluguAsianet News Telugu

మేము కూడా రక్తదానం చేస్తామంటున్న పిల్లులు, కుక్కలు

మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండటం కారణంగానే ఈ బ్లడ్ బ్యాంకులు ఏర్పడ్డాయి. ఎవరికైనా కుక్క లేదా పిల్లి బ్లడ్ కావాలంటే ఈ బ్యాంకులలో సంప్రదించవచ్చు. 

Animal Blood Bank Dogs And Cats Donate Blood In Us And Uk
Author
Hyderabad, First Published Feb 25, 2021, 10:24 AM IST

మనుషులు రక్తదానం చేయడం సర్వ సాధారణం. రక్తం అవసరమైన వారికి వారి బ్లడ్ గ్రూప్ సేమ్ ఉన్నవారు చాలా మంది ఇప్పటి వరకు రక్తదానం చేసి ఉంటారు. ఇందుకోసం స్పెషల్ గా బ్లడ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అయితే.. స్పెషల్ గా జంతువులు ఎప్పుడైనా రక్తదానం చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇలా జరుగుతోంది. పిల్లలు, కుక్కలు కూడా తమ తోటి జంతువుల కోసం రక్తదానం చేస్తున్నాయి.

ప్రపంచంలోని పలు దేశాల్లో ‘పెట్స్ బ్లడ్ బ్యాంక్’ లు ఉన్నాయి. ఈ బ్లడ్ బ్యాంకులలో అధికశాతంలో కుక్కలు, పిల్లుల రక్తం లభ్యమవుతుంది. ఈ జంతువులు... మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండటం కారణంగానే ఈ బ్లడ్ బ్యాంకులు ఏర్పడ్డాయి. ఎవరికైనా కుక్క లేదా పిల్లి బ్లడ్ కావాలంటే ఈ బ్యాంకులలో సంప్రదించవచ్చు. 

కుక్కలకు, పిల్లులకు కూడా బ్లడ్ గ్రూపులలో వివిధ రకాలు ఉంటాయి. కుక్కలకు సంబంధించి 12 రకాల బ్లడ్ గ్రూపులుంటాయి. పిల్లులకు మూడు రకాల బ్లడ్ గ్రూపులుంటాయి. ఉత్తర అమెరికాలోని ‘పశు చికిత్స బ్లడ్ బ్యాంక్’ హెడ్ డాక్టర్ కెసీ మిల్స్ తెలిపిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాలోని డిక్సన్, గార్డెన్ గ్రోవ్ పట్టణాలతో పాటు స్టాక్‌బ్రిడ్జి, వర్జీనియా, బ్రిస్టో, మేరీలాండ్ తదితర ప్రాంతాలలో పశువుల బ్లడ్ బ్యాంకులున్నాయి. ఇక్కడికి చాలామంది తమ కుక్కలను, పిల్లులను తీసుకువచ్చి వాటిచేత రక్తదానం చేయిస్తుంటారు. 

పశువులకు సంబంధించిన రక్తదాన ప్రక్రియకు 30 నిముషాల సమయం పడుతుంది. అయితే వాటి నుంచి బ్లడ్ సేకరించేటప్పడు వాటికి మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అప్పుడప్పుడు రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తుంటారు. భారత్‌లోని తమిళనాడులో ‘తనువాస్ పశు బ్లడ్ బ్యాంక్’ ఉంది. ఇది ప్రభుత్వ పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios