అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: మృతుల్లో భారత్ కు చెందిన తండ్రీకొడుకులు

An Indian family involved in a car crash.
Highlights

అమెరికాలో జూన్ 15, 2015వ తేదీన జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాందం జరిగింది. ఇందులో భారతదేశానికి చెందిన కుటుంబం కూడా ఉంది.

కాలిఫోర్నియా: అమెరికాలో జూన్ 15, 2015వ తేదీన జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాందం జరిగింది. ఇందులో భారతదేశానికి చెందిన కుటుంబం కూడా ఉంది. ఈ ప్రమాదంలో తరుణ్ (తండ్రి), రోహన్ (3 ఏళ్ల కుమారుడు) ప్రమాదస్థలిలోనే ప్రాణాలు విడిచిపెట్టారు. ఇదే సమయంలో కారులో ప్రయాణిస్తున్న తరుణ్ భార్య శ్వేత, పదేళ్ల కుమార్తె షగుణ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. శగుణ్ తలకు బలమైన గాయం కావడంతో ఆమె కోమా స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

శుక్రవారం రోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, తరుణ్ కుటుంబం కాలిఫోర్నియా ఎయిర్‌పోర్ట్ నుంచి ఐర్విన్‌లోని తమ ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారి డ్యూయెన్ గ్రాహమ్ తెలిపిన వివరాల ప్రకారం, తరుణ్ కుటుంబం ప్రయాణిస్తున్న హోండా సిఆర్‌వి కారు 405 ఫ్రీవేపై నిలిచిపోయి ఉందని, ఆ సమయంలో తరుణ్, రోహన్‌లు కారు దిగిఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన టొయోటా ఆర్ఏవి-4 కారు, సిఆర్‌వి కారును ఢీకొట్టడంతో తండ్రి, కొడుకులు ప్రమాదస్థలిలోనే ప్రాణాలు విడిచారని తెలిసింది. ఆ సమయంలో టొయోటా కారును 47 ఏళ్ల మహిళ నడిపినట్లు సమాచారం. 

ఈ సంఘటన గురించి తెలుసుకున్న తరుణ్ కుటుంబ సభ్యులు ఇండియా నుంచి అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన శ్వేత, షగుణ్ వైద్యసేవల కోసం తరుణ్ మిత్రులు గోఫండ్‌మి అనే వెబ్‌సైట్ ద్వారా దాతల నుండి విరాలాలు సేకరిస్తున్నారు.

loader