Earthquake: ఫిలిప్పీన్స్ లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశ రాజధాని మనీలాలో భూప్రకంపనలు సంభవించాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఉత్తర ఫిలిప్పీన్స్ లోని మిండోరో ద్వీపంలో గురువారం రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, రాజధాని మనీలా, పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
Philippines Earthquake: ఫిలిప్పీన్స్ లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశ రాజధాని మనీలాలో భూప్రకంపనలు సంభవించాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఉత్తర ఫిలిప్పీన్స్ లోని మిండోరో ద్వీపంలో గురువారం రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, రాజధాని మనీలా, పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
వివరాల్లోకెళ్తే.. ఫిలిప్పీన్స్ లో గురువారం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, ప్రకంపనల కారణంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానిక అధికారులు హెచ్చరించారు. రాజధాని మనీలాకు 120 కిలో మీటర్ల దూరంలో, 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని తెలిపారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించిన తర్వాత తాను, తన సిబ్బంది బయటకు పరుగులు తీసినట్టు కలటగాన్ మున్సిపాలిటీ పోలీస్ చీఫ్ ఎమిల్ మెండోజా తెలిపారు. ప్రస్తుతం సంభవించిన భూకంప ప్రభావం చాలా అధికంగానే ఉందనీ, ప్రకంపనల సమయంలో తాము పరుగెత్తాల్సి వచ్చిందని మెండోజా వెల్లడించారు.
భూకంపం నేపథ్యంలో ప్రాణనష్టం లేదా నష్టం గురించి తక్షణ సమాచార నివేదికలు లేవు, కానీ ప్రకంపనల ప్రభావాన్ని అంచనా వేయడానికి విపత్తు అధికారులను నియమించామని మెండోజా చెప్పారు. భూకంపం 30 సెకన్ల నుంచి నిమిషం వరకు కొనసాగిందని కలటగాన్ విపత్తు అధికారి రోనాల్డ్ టోర్రెస్ తెలిపారు. భూకంపం ధాటికి రాజధానిలోని భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని సివిల్ డిఫెన్స్ కార్యాలయ సమాచార అధికారి డియాగో మరియానో తెలిపారు. "ప్రస్తుతానికి పెద్దగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదు. మదింపు ఇంకా కొనసాగుతోంది" అని మరియానో మీడియాతో అన్నారు.
కాగా, జపాన్ నుండి ఆగ్నేయాసియా-పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించిన తీవ్రమైన భూకంప-అగ్నిపర్వత కార్యకలాపాలకు ఆలవాలమైన పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్ లో భూకంపాలు రోజువారీగా సంభవిస్తాయి. 2013 అక్టోబర్ లో సెంట్రల్ ఫిలిప్పీన్స్ లోని బోహోల్ ద్వీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించి కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మరణించారు. ఫిలిప్పీన్స్ లో కాథలిక్ మతం పుట్టినిల్లులోని పాత చర్చిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం కారణంగా దాదాపు 400,000 మంది నిర్వాసితులయ్యారు. పెద్ద సంఖ్యలో గృహాలు దెబ్బతిన్నాయి.
