పాక్‌లో కలకలం: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మాధురీ, అమితాబ్

amitabh bachchan madhuri dixit posters viral in pakistan
Highlights

పాకిస్తాన్‌లో ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్ని తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీకి(పీటీఐ)కి చెందిన ఓ పోస్టర్ కలకలం రేపింది

ఇదేంటి పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అమితాబ్, మాధురీ దీక్షిత్ ప్రచారం చేయడం ఏంటి అని కంగారు పడకండి. పాకిస్తాన్‌లో ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్ని తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీకి(పీటీఐ)కి చెందిన ఓ పోస్టర్ కలకలం రేపింది. ముల్తాన్ ప్రాంతంలోని ఓ ఇంటి గోడపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఫోటోతో పాటు  బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్‌ల ఫోటోలు ఉన్నాయి.

ఈ పోస్టర్ పీటీఐకి చెందిన సర్దార్ అబ్బాస్ డోగార్‌కు చెందినది తెలుస్తోంది. బాలీవుడ్‌ తారలకు పాక్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. వీరిని అభిమానించే వారు కోట్లలో ఉన్నారు. బహుశా అభిమానులను ఆకట్టుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతోనే ఇలా పోస్టర్లు ఏర్పాటు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో కొందరు నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. భారతీయ సినిమాలు పాక్‌లో విడుదల చేయరు కానీ ఆ దేశానికి చెందిన నటీనటులను మాత్రం ప్రచారానికి వాడుకుంటారా..? అని కొందరు... మాధురీ, అమితాబ్ పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 


 

loader