ఒకరికి ఒక జీవితంలో లాటరీ లగలడం పెద్ద అదృష్టం.. కొందరి జీవితంలో ఇది జరగకపోవచ్చు కూడా. అలాంటిది ఏకంగా మూడు లాటరీలు తగిలితే.. అది కూడా 24 గంటల్లోనే జరిగితే ఆ వ్యక్తిది మామూలు అదృష్టం కాదు కదా...

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన రాబర్ట్ స్టీవర్ట్ కేవలం 24 గంటల వ్యవధిలోనే మూడు లాటరీలు గెలుచుకున్నాడు. ఈ మూడు డ్రా లలో కలిపి అతను ఏకంగా 50 లక్షల 600 డాలర్లు ( సుమారు రూ.36.24 కోట్లు) గెలుచుకున్నాడు.

ఈ ఏడాది ఆగస్టు 2న రాబర్ట్‌కు స్క్రాచ్ లాటరీ గేమ్‌లో 50 లక్షలు డాలర్లు (రూ.36.2 కోట్లు) గెలుచుకున్నాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 500 డాలర్లు (రూ.36,380) రాగా.. మూడో ప్రయత్నంలో 100 డాలర్లు (రూ.7,276) గెలుచుకున్నాడు.

ఒక్కసారిగా ఇంత మొత్తం గెలుచుకున్న రాబర్ట్.. న్యూజెర్సీ లాటరీ నిర్వాహకులతో తన పేరు బయటపెట్టవద్దని కోరాడు.. దీంతో కొంతకాలం ఆగి .. ఇటీవలే అతని పేరును బయట పెట్టింది. తాను లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని కుటుంబం కోసం, బిజినెస్ విస్తరణ కోసం వెచ్చిస్తానని తెలిపాడు. మరోవైపు రాబర్ట్ స్టీవర్ట్ ఇదే ఏడాదిలో 2,500 డాలర్లు( సుమారు రూ.1.81 లక్షలు) గెలుచుకున్నారు.