Asianet News TeluguAsianet News Telugu

గాలిలో ఎదురెదురుగా ఢీకొన్న అమెరికా సైనిక హెలికాప్టర్లు.. ఫోర్ట్ క్యాంప్ బెల్ సమీపంలో ఘటన

అమెరికా ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు గాలిలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారమూ లేదు. పైలెట్ల శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

American military helicopters collided in the air..Incident near Fort Camp Bell
Author
First Published Mar 30, 2023, 2:16 PM IST

అమెరికా ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన ఫోర్ట్ క్యాంప్ బెల్ సమీపంలో బుధవారం చోటు చేసుకుందని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టమూ జరిగినట్టు ఇప్పటి వరకు సమాచారం లేదు. ప్రస్తుతం సిబ్బంది పరిస్థితి ఏంటనేది తెలియరాలేదు. అయితే గవర్నర్ ఆండీ బెషర్ ట్వీట్ ప్రకారం.. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది.

శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి.. ఆలయంలోని మెట్ల బావిలో పడిపోయిన 25 మంది భక్తులు..

కెంటకీ గవర్నర్ తన ట్వీట్ లో.. ‘‘ఫోర్ట్ క్యాంప్బెల్ నుంచి మాకు కొన్ని కఠినమైన వార్తలు వచ్చాయి. హెలికాప్టర్ ప్రమాదంలో మరణాలు సంభవించే అవకాశం ఉంది. దయచేసి బాధితులందరి కోసం ప్రార్థించండి. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు ప్రారంభించాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదానికి గురైన రెండు హెలికాప్టర్లు అమెరికా మిలిటరీ ఫ్లీట్ కు చెందిన హెచ్ హెచ్ -60 బ్లాక్ హాక్. ఫోర్ట్ క్యాంప్ బెల్ లో ఉన్న 101 ఎయిర్ బోర్న్ డివిజన్ కు చెందిన ఈ హెలికాప్టర్లను వైమానిక దాడులు, వైద్య తరలింపు సహా వివిధ ప్రయోజనాల కోసం సైన్యం ఉపయోగిస్తుంటుంది. అయితే శిక్షణ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. 

తెరిచిన గుడ్డులోంచి పొదిగించిన కోడిపిల్ల.. ఈ వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు...

ఇలాంటి ప్రమాదమే ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ బీచ్‌లో చోటు చేసుకుంది. జనవరి 2వ తేదీన రెండు హెలికాప్టర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ హెలిక్యాప్టర్ లో ఉన్న ప్రయాణికులకు గాయాలు అయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు. మరో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని పేర్కొన్నారు. క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్ కోస్ట్‌లోని మెయిన్ బీచ్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘర్షణ వల్ల హెలికాప్టర్ శిథిలాలు బీచ్ లోని ఇసుకపై పడిపోయాయి. దీంతో అధికారులు క్రాష్ సైట్‌కు దారితీసే సీవరల్డ్ డ్రైవ్‌ను మూసివేశారు. సీవరల్డ్ థీమ్ పార్క్ సమీపంలో ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆరోగ్య సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios