వాషింగ్టన్: కరోనా సోకినట్లు తేలడంతో వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా వున్నట్లు సమాచారం. గత 24 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు... మరో 48గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారని అతడి సన్నిహితులు, వైట్ హౌస్ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయట. అధికారికంగా మాత్రం ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతంగా వున్నట్లు డాక్టర్లు, వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. అసలు నిజమేంటో తెలియక అమెరికా ప్రజలే కాదు యావత్ ప్రపంచం గందరగోళంలో వుంది. 

ఇటీవలే అమెరికా ప్రథమ పౌరుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లకు ఇ కరోనా పాజిటివ్ అని తేలింది.  ట్రంప్ సలహాదారుణికి  పనిచేస్తున్న హూప్ హిక్సుకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే హూప్ హిక్సు ప్రెసిడెంట్ తో కలిసి ప్రెసిడెన్షియల్ హెలికాప్టర్ మెరైన్‌వన్, ఎయిర్‌ఫోర్స్ వన్ మిన్నెసోటాలో ప్రయాణించారు. దీంతో ట్రంప్, మెలానియా కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నారు. 

read more  కరోనాను సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే.. ట్రంప్ కు ఈ పరిస్థితి : బైడెన్

ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు  కరోనా పరీక్ష చేయించుకున్నారు. పరీక్షా ఫలితాన్ని బట్టి క్వారంటైన్‌లోకి వెళతామని నిర్దారణ కాకముందే ట్రంప్ ట్వీట్ చేశారు.  అయితే పరీక్షా ఫలితాల్లో ట్రంప్ కు, మెలానియాకు పాజిటివ్ అని తేలడంతో క్వారంటైన్ లోకి వెళ్లారు. వైట్ హౌస్ లోనే వుండి చికిత్స పొందుతుండగా ట్రంప్ ఆరోగ్యం క్షీణిస్తుంటే సైనిక హాస్పిటల్ కు తలించినట్లు సమాచారం.