Asianet News TeluguAsianet News Telugu

కరోనాను సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే.. ట్రంప్ కు ఈ పరిస్థితి : బైడెన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాస్క్ పెట్టుకోకపోవడం వల్లే కరోనా బారిన పడ్డాడని ప్రత్యర్థి జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్క్‌ ధరించకపోవడం వల్లే ట్రంప్‌కు ఈ పరిస్థితి తలెత్తిందని.. కాబట్టి జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతకుముందు మంగళవారం క్వీన్ ల్యాండ్స్ లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో దాదాపు 90 నిమిషాల పాటు ట్రంప్‌తో సన్నిహితంగా ఉన్నారు బైడెన్. ట్రంప్ కు పాజిటివ్ అని తేలగానే బైడెన్‌, ఆయన భార్య జిల్‌ శుక్రవారం పరీక్షలు చేయించుకున్నారు. వారికి నెగిటివ్‌ వచ్చింది. 

Biden calls Trump's positive test a 'bracing reminder' of seriousness of coronavirus pandemic
Author
Hyderabad, First Published Oct 3, 2020, 9:26 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాస్క్ పెట్టుకోకపోవడం వల్లే కరోనా బారిన పడ్డాడని ప్రత్యర్థి జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్క్‌ ధరించకపోవడం వల్లే ట్రంప్‌కు ఈ పరిస్థితి తలెత్తిందని.. కాబట్టి జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతకుముందు మంగళవారం క్వీన్ ల్యాండ్స్ లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో దాదాపు 90 నిమిషాల పాటు ట్రంప్‌తో సన్నిహితంగా ఉన్నారు బైడెన్. ట్రంప్ కు పాజిటివ్ అని తేలగానే బైడెన్‌, ఆయన భార్య జిల్‌ శుక్రవారం పరీక్షలు చేయించుకున్నారు. వారికి నెగిటివ్‌ వచ్చింది. 

కరోనాను కూడా ప్రచారానికి వాడుకున్నారు బైడెన్. కరోనాను తీవ్రంగా పరిగణించనందువల్లే ట్రంప్ కరోనా బారిన పడ్డాడని, తాను సీరియస్ గా తీసుకున్నా కాబట్టి తనకు నెగెటివ్ వచ్చిందని అమెరికన్లకు గుర్తుచేశాడు, తన ప్రత్యర్థిలా కాకుండా, తాను మాస్క్‌ని ఖచ్చితంగా వాడానన్నారు. ఇక మాస్క్‌ ధరించడం అంటే దేశభక్తి కలిగి ఉండటమేనని.. ఎవరికోసమే కాక మీ కోసం ఈ పని చేయాలని కోరారు బైడెన్‌. ప్రత్యర్థి అయినా ట్రంప్, అతని కుటుంబం కోసం తాను ప్రార్థిస్తున్నానని బైడెన్‌ తెలిపారు. 

శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు చికిత్స తీసుకుంటున్నారు. ఆయన బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తమకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రకటించిన తర్వాత ట్రంప్‌ దంపతులు బహిరంగంగా కనిపించలేదు. అయితే పాజిటివ్ వచ్చిన తరువాత మాత్రం ట్రంప్ మాస్క్‌ ధరించి వైట్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చి, వాషింగ్టన్‌ బయట ఉన్న వాల్టర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ ప్రకారం ట్రంప్‌ ఓ వీడియోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. తాను ఆస్పత్రి పాలయ్యానని.. కానీ బాగానే ఉన్నానని తెలిపారు. అన్ని సక్రమంగా జరిగేలా చూస్తానన్నారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కూడా బాగానే ఉన్నారని ఈ వీడియోలో తెలిపారు ట్రంప్‌. 

కరోనా కారణంగా కొద్ది రోజుల పాటు ట్రంప్ వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచే పనులు చక్కబెడతారని  ప్రెస్‌ సెక్రటరీ కైలీ మెక్‌నానీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడు తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని.. ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవడానికి ఈ ప్రయత్నం అన్నారు. ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న రెజెనెరాన్‌ యాంటీబాడీ కాక్టెయిల్‌ డోస్‌ ట్రంప్‌కిచ్చారని వైట్‌ హౌస్‌ వైద్యుడు సీన్‌ కొన్లీ కీలక ప్రకటన చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios