అమెరికాలో H1బి వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను వీసాల పేరుతో ఓ కిలాడీ జంట నట్టేట ముంచింది. అమెరికాలో చదువుకుంటూ F1 వీసా ఉన్న విద్యార్థులకు H1 వీసాలు ఇప్పిస్తామని ముత్యాల సునీల్, ప్రణీత అనే జంట 30 మంది తెలుగు విద్యార్థుల దగ్గర రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

కన్సల్టెంట్ కంపెనీ పేరుతో సునీల్, ప్రణీత అనే జంట తెలుగు విద్యార్థుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక్కో తెలుగు విద్యార్థి నుంచి 25 వేల డాలర్లు వసూలు చేసింది. దీంతో బాధితులు అట్లాంటా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు. అప్పటికే వీరిద్దరూ పరారయ్యారు. వీరు యూరప్ పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.
వారి కోసం ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల దగ్గర వసూలు చేసిన డబ్బులను సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ ఖాతాకు బదిలీ చేశాడు. ఇప్పుడాయన పరారీలో ఉన్నారు. ఇలా విద్యార్థులను మోసగించి సునీల్ పంపిన డబ్బుతో సత్యనారాయణ కోట్ల ఆస్తి కూడబెట్టినట్లు భావిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 7, 2020, 11:32 AM IST