Lord Rama: అయోధ్యతోపాటు మెక్సికోలోనూ ఇవాళే ప్రాణ ప్రతిష్ట.. అమెరికా పురోహితుడి వీడియో వైరల్
అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టతోపాటు అదే రోజున మెక్సికోలోనూ రామ ఆలయం ప్రారంభించారు. అక్కడ అమెరికా పురోహితుడు మంత్రోచ్ఛరణలు చేయగా.. భారత సంతతి శ్లోకాలు, పాటలు పాడుతూ మందిరమంతా ఆధ్యాత్మిక భావంతో నిండిపోియంది.
Lord Rama: ఈ రోజు అయోధ్య రామ మందిరలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఇక్కడ ప్రాణ ప్రతిష్ట జరగడానికి కొన్ని గంటల ముందు మెక్సికోలోనూ రాముడికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఉత్తర అమెరికాకు చెందిన మెక్సికో దేశంలోని క్యురెటరో నగరంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. మెక్సికోలో తొలి రామ మందిరాన్ని ప్రారంభించారు. ఒకే రోజు ఈ రెండు కార్యక్రమాలు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా రామ నామ స్మరణలు కనిపించాయి.
క్యురెటరో నగరంలోని ఆలయంలో భారత సంతతి మంత్రాల ఉచ్ఛారణ, రామ నామ స్మరణలతో నిండిపోయింది. ఇది భారత సంస్కృతి ఎల్లలు దాటిన ఘట్టానికీ ఉదాహరణగా నిలిచింది. అమెరికా పురోహితుడు మంత్రాలు చదువుతూ రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. మెక్సికన్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతిష్టించడానికి రాముడి విగ్రహాన్ని ఇండియా నుంచే తీసుకెళ్లారు.
Also Read : Raja Singh: లోక్ సభ ఎన్నికల్లో రాజాసింగ్ ఆసక్తి.. హైదరాబాద్ సీటు వద్దని.. అక్కడి నుంచి పోటీకి సై
మెక్సికోలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మెక్సికోలో రామ మందిర ప్రారంభాన్ని వెల్లడించింది. ‘అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న తరుణంలో మెక్సికోలో తొలి రామ మందిరం ప్రారంభమైంది. హనుమంతుడి ఆలయం తొలి ఆలయం ఉన్న నగరం కూడా క్యురిటెరోనే’ అని వివరించింది. ‘అమెరికా పురోహితుడు ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. ఇండియా నుంచే విగ్రహాన్ని తెచ్చారు. ఇక్కడ ఆలయం మొత్తం భారత సంతతతి పాటలు, శ్లోకాలతో నిండిపోయింది’ అని ఇందుకు సంబంధించిన వీడియోలతో ఇండియన్ ఎంబసీ ఎక్స్‌లో పోస్టు చేసింది.
మెక్సికోలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మెక్సికోలో రామ మందిర ప్రారంభాన్ని వెల్లడించింది. ‘అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న తరుణంలో మెక్సికోలో తొలి రామ మందిరం ప్రారంభమైంది. హనుమంతుడి ఆలయం తొలి ఆలయం ఉన్న నగరం కూడా క్యురిటెరోనే’ అని వివరించింది.
‘అమెరికా పురోహితుడు ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. ఇండియా నుంచే విగ్రహాన్ని తెచ్చారు. ఇక్కడ ఆలయం మొత్తం భారత సంతతతి పాటలు, శ్లోకాలతో నిండిపోయింది’ అని ఇందుకు సంబంధించిన వీడియోలతో ఇండియన్ ఎంబసీ ఎక్స్‌లో పోస్టు చేసింది.