వీరిలో 25మంది సైనికులు మరో 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. మంటల నుంచి సుమారు వంద  మందికి పైగా ప్రజలను సైనికులు రక్షించారు. 


ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కబైలియా రీజియన్ లోని కొన్ని ప్రాంతాల్లో పలు దఫాలుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 42 మంది సజీవదహనమయ్యారు. వీరిలో 25మంది సైనికులు మరో 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. మంటల నుంచి సుమారు వంద మందికి పైగా ప్రజలను సైనికులు రక్షించారు. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు మృత్యువాత పడటం విషాదకరం. కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred