Asianet News TeluguAsianet News Telugu

యుఎస్‌లో షాకింగ్.. విమానం ఇంజిన్‌ గుంజేయడంతో ఎయిర్‌పోర్ట్ వర్కర్ మృతి..

పార్క్ చేసిన విమానం ఇంజిన్ లోకి గుంజుకోవడంతో ఓ విమాన సిబ్బంది మరణించిన విచిత్ర సంఘటన అమెరికాలోని అలబామాలో చోటు చేసుకుంది. 

Airport Worker Sucked Into Jet Engine and Dies In US
Author
First Published Jan 3, 2023, 12:40 PM IST

అలబామా : అమెరికాలోని అలబామాలో ఓ విచిత్రమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎయిర్ పోర్ట్ ఉద్యోగి ఒకరు మరణించారు. డిసెంబరు 31న ఈ విషాద ఘటన జరిగింది. అమెరికా విమానాశ్రయంలోని సిబ్బందిలో ఒకరు విమానం ఇంజిన్‌లోకి చొచ్చుకుపోయి మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. అలబామాలోని మోంట్‌గోమెరీ ప్రాంతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ప్రకటన ప్రకారం, మోంట్‌గోమేరీ ప్రాంతీయ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ పక్రారం.. విమానం దాని పార్కింగ్ బ్రేక్ సెట్ లో ఉన్నప్పుడు ఓ విమాన కార్మికుడు ఎంబ్రేయర్ 170 ఇంజిన్‌లోకి ప్రమాదవశాత్తు పీల్చుకోబడ్డాడు. 

ఇదేం పిచ్చిపని.. మూడేళ్ల చిన్నారిని పట్టాలమీదికి తోసేసి.. నింపాదిగా కూర్చుంది.. కారణం ఏంటంటే..

డల్లాస్ నుండి వచ్చిన ఈ విమానం తన పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేయబడింది. అయితే దురదృష్టవశాత్తు దాని ఇంజిన్‌లలో ఒకటి ఇంకా నడుస్తూనే ఉంది. దీంతో అక్కడి సిబ్బందిలో ఇకరు ఇంజిన్ లోని గుంజుకోబడ్డారు. బాధితుడు పీడ్‌మాంట్‌ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నాడు.

"ఏఏ/పీడ్‌మాంట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక సభ్యుడు విషాదకరమైన ఘటనలో మృత్యువాత పడడం గురించి విన్నాం. మరణానికి చాలా బాధపడ్డాం" అని విమానాశ్రయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వేడ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి సాయం చేయమని దేవుడిని ప్రార్థిస్తున్నాం... ఆయన అన్నారు.

ఈ వార్త చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. "ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అవసరమైన మద్దతు మా నుంచి లభిస్తుందని హామీ ఇస్తున్నాం" అని కంపెనీ న్యూయార్క్ పోస్ట్‌కు తెలిపింది. ఈ ఘటన మీద ఎన్‌టిఎస్‌బి, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ జరుపుతున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios