Asianet News TeluguAsianet News Telugu

సూట్ కేసులో దూరిన పిల్లి... ఎయిర్ పోర్టులో చెక్ చేస్తుండగా...

న్యూయార్క్‌లోని JFK ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. భద్రతా అధికారులు ఓ ప్రయాణికుడి సూట్ కేసు పరిశీలించగా... అందులో పిల్లి ఉండటం గమనార్హం.

Airport Security finds cat in passenger suitcase in New york
Author
First Published Nov 26, 2022, 1:18 PM IST

పిల్లిని పెంచుకునేవారికి వాటి గురించి బాగా తెలుస్తుంది. పిల్లి కోసం మీరు ఎన్ని బొమ్మలు కొన్నా... అవి ఎక్కువగా బాక్స్ లతో ఆడుతూ ఉంటాయి. బాక్స్ లో దూరుతూ ఉంటాయి. తాజాగా.. ఎయిర్ పోర్టులో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఓ పిల్లి.... సూట్ కేసులో దూరింది.ఈ సంఘటన, న్యూయార్క్‌లోని JFK ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. భద్రతా అధికారులు ఓ ప్రయాణికుడి సూట్ కేసు పరిశీలించగా... అందులో పిల్లి ఉండటం గమనార్హం.

 


ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ యొ అధికారిక ట్విట్టర్ ఖాతా లో పోస్టు చేసిన దాని ప్రకారం.. ఫ్లోరిడాకు వెళ్లే ఓ ప్రయాణికుడి సూట్ కేసులో  పిల్లి ఉన్నట్లు గుర్తించారు. ఎయిర్ పోర్టులో లగేజ్ స్కాన్ చేయడం గురించి తెలిసే ఉంటుంది. ఓ ప్రయాణికుడి లగేజ్ స్కాన్ చేస్తుందే.. ఏదో అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే తెరచి చూడగా.. అందులో పిల్లి కనిపించింది. అది మ్యావ్ అంటూఅరుచుకుంటూ బయటకు రావడం గమనార్హం. ఆ పిల్లి... ఆరెంజ్ రంగులో చాలా ముద్దుగా ఉంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ పోస్ట్‌కి అనేక స్పందనలు వచ్చాయి. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, స్మెల్స్ అనే నారింజ పిల్లి ప్రమాదవశాత్తు సూట్‌కేస్‌లోకి వచ్చింది. పిల్లి ని చూసి భద్రతా సిబ్బంది షాక్‌కు గురయ్యారని TSA ప్రతినిధి లిసా ఫార్బ్‌స్టెయిన్ ఒక ప్రకటనలో తెలిపారు. అది అక్రమ రవాణా కాదని.. అనుకోకుండా జరిగిన సంఘటనగా గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios