ఇండోనేషియాలో విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి బయల్దేరిన కాసేపటికే విమానం సిగ్నల్స్ కట్ అయిపోయాయి. విమానం టేకాఫ్ అయిన తర్వాత రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.

శ్రీ విజయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-500 క్లాసిక్ విమానం (ఫ్లైట్ నెంబర్ ఎస్‌జే 182) జకార్తా నుంచి పోంటియానక్‌కు బయల్దేరింది. అదృశ్యమైన విమానంలో 56 మంది ప్రయాణికులు వున్నారు. వీరిలో 46 మంది పెద్దలు, ఏడుగురు చిన్నారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.