Asianet News TeluguAsianet News Telugu

విమానంలో ప్యాంట్ విప్పి వికృత చేష్ట.. రూ.2కోట్ల జరిమానా

ఓ వ్యక్తి కోవిడ్ రూల్స్ పాటించకుండా విమానంలో మూర్ఖంగా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ.. చాలా నీచంగా ప్రవర్తించాడు. 

Airline passenger faces federal charge with a possible $250,000 fine for refusing to wear mask, urinating in cabin
Author
Hyderabad, First Published Mar 17, 2021, 9:10 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. చాలా దేశాలు కొన్ని నెలల పాటు లాక్ డౌన్ కూడా విధించాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కాస్త బయట తిరగగలుగుతున్నారు. ఇంకా కరోనా వ్యాప్తి తగ్గలేదు కాబట్టి.. మాస్క్ లు ధరించి.. కోవిడ్ నియమాలు పాటించాలని అధికారులు చెబుతూనే ఉన్నారు. అయితే.. ఓ వ్యక్తి కోవిడ్ రూల్స్ పాటించకుండా విమానంలో మూర్ఖంగా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ.. చాలా నీచంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొలరాడోకి చెందిన 24 ఏళ్ళ లాండన్‌ గ్రియర్‌. ఆలాస్కా ఎయిర్‌లైన్‌ ఫ్లైట్‌లో మార్చి 9న ప్రయాణిస్తోన్న సదరు వ్యక్తిని విమాన సిబ్బంది మాస్క్‌ పెట్టుకోమని పదేపదే కోరారు. గ్రియర్‌ నిద్రనటిస్తూ, మాస్క్‌పెట్టుకోమని పదే పదే విజ్ఞప్తి చేసినా, వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిం చాడు. 

అంతేకాకుండా విమానంలోని తన సీటుపైనే మూత్రవిసర్జన చేసి అసహ్యంగా ప్రపవర్తించడంతో తోటి ప్రయాణీకులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో విమానం ల్యాండ్‌ అయిన అనంతరం 24 ఏళ్ళ లాండన్‌ గ్రియర్‌ను ఎఫ్‌బిఐ అరెస్టు చేసింది. డెన్వర్‌లోని జిల్లా కోర్టులో కేసు ఫైల్‌ చేశారు. 

గ్రియర్‌ సీటెల్‌ నుంచి డెన్వర్‌కి ఫ్లైట్‌ ఎక్కే ముందు మూడు నుంచి నాలుగు బీర్లను తాగానని ఎఫ్‌బిఐ ఏజెంట్లతో చెప్పారు. విమాన సిబ్బందిని కొట్టినట్టు తనకు గుర్తు లేదని, తాను మూత్ర విసర్జన చేసిన విషయం కూడా తనకు తెలియదని గ్రియర్‌ చెప్పుకొచ్చాడు. నిజానికి గ్రియర్‌ తన ప్యాంట్‌ విప్పి అసహ్యంగా ప్రవర్తిస్తుండగా విమాన సిబ్బంది హెచ్చరించడంతో తాను మూత్రవిసర్జన చేస్తున్నానిచెప్పాడు. ప్రస్తుతం పదివేల డాలర్ల పూచీకత్తుతో గ్రియర్‌ విడుదలయ్యాడు. విమాన సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న అభియోగాలతో అరెస్టయిన ఈ తాగుబోతు నేరం రుజువైతే, గరిష్టంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే దాదాపు రెండు కోట్ల జరీమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios