యుద్ధంలో చిక్కుకున్న ఉక్రెయిన్ జనాలకు ప్రపంచవ్యాప్తంగా మద్ధతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే వారిని అక్కడినుంచి తరలించి.. సాయం అందించడానికి ఏయిర్ బిఎన్ బికి వెకేషన్ రెంటల్స్ బుకింగ్ వేలాదిగా జరుగుతన్నాయి.
ఉక్రెయిన్ : రష్యా దాడిలో అతలాకుతలం అవుతున్న రష్యాకు వేలాదిగా వెకేషన్ రెంటల్‌లు బుక్ అవుతున్నాయి. వేలాది మంది Airbnb వినియోగదారులు ఉక్రెయిన్ కు వెకేషన్ రెంటల్స్ ను బుక్ చేసుకుంటున్నారు, యుద్దంలో వెకేషన్ ఏంటీ అనుకుంటున్నారా? అక్కడి ప్రాంతాలను సందర్శించి సరదాగా గడపడానికి కాదు.. రష్యా దండయాత్రను తట్టుకుని పోరాడుతున్న స్థానికులకు సహాయం అందించడానికి మాత్రమే.
గత వారంలో రెండు రోజుల వ్యవధిలోనే, ఉక్రెయిన్‌లో గడపడానికి 1.9 మిలియన్ల డాలర్లు ఖర్చుతో 61,000 కంటే ఎక్కువ నైట్స్ రిజర్వేషన్స్ జరిగాయని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కంపెనీ ప్రతినిధి మంగళవారం AFPకి తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మాస్కోలో US టెక్ ఫ్రీజ్-ఔట్‌లో చేరి, రష్యా, బెలారస్‌లలో తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు Airbnb ప్రకటించడంతో దానికి మద్దతు వెల్లువెత్తింది.
Airbnbలో వారి రెంటల్స్ ను బుక్ చేసిన తర్వాత, కొంతమంది వినియోగదారులు తమకు వచ్చిన హృదయాన్ని కదిలించే స్పందనను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తమకు ఆర్థిక, నైతిక మద్దతు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉక్రేనియన్ హోస్ట్‌లు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియోలు పంపారు. ఒక వినియోగదారుడు మాట్లాడుతూ ఓ భార్యాభర్తలు, రష్యా మెయిన్ టార్గెట్స్ అయిన కైవ్, ఖార్కివ్ నగరాల్లో రిజర్వేషన్లు చేసుకున్నామని చెప్పుకొచ్చారు.
కెనడాలోని ఎడ్మోంటన్‌కు చెందిన మేఘన్ బామ్‌ఫోర్డ్ మాట్లాడుతూ, "జీవితాల్ని నాశనం చేసే తీవ్ర సంక్షోభం మధ్యలో ఉన్నప్పుడు.. మీ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావడం.. యుద్ధ బీభత్సం నెలకొన్న కైవ్ లేదా చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీల వంటి చోట తప్పనిసరి పరిస్తిత్తుల్లో ఉండాల్సి రావడం.. అక్కడినుంచి సులభంగా బయటపడడం మధ్య తేడా చాలా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. బామ్‌ఫోర్డ్, ఆమె భర్త సహాయ సంస్థలకు విరాళాలు ఇస్తుంటారు. అలాగే ఉక్రేనియన్‌లకు నేరుగా నగదు పంపడానికి Airbnbని వాడామని తెలిపారు.
Airbnb ప్రచారం చేసుకోదు. కానీ సర్వీస్ చాలా చురుగ్గా చేస్తుంది. ఉక్రేనియన్ హోస్ట్‌లకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వినియోగదారుల నుండి సందేశాలను ప్రసారం చేయడానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రియాన్ చెస్కీ ట్విట్టర్ ను వాడుకున్నారు. యుద్ధం ఎంత భయానకంగా ఉందో, ప్రపంచం తమ గురించి ఆలోచిస్తోందని.. తెలుసుకున్న వారు ఎంత కృతజ్ఞతతో ఉన్నారో ఆతిథ్యం ఇచ్చేవారు తనకు సందేశాలలో వ్యక్తం చేశారని బామ్‌ఫోర్డ్ చెప్పారు. ‘మనఇంట్లో సుఖంగా కూర్చోవడం బాగుంటుంది. సౌకర్యవంతంగా ఉంటుంది’ కానీ యుద్దంలో చిక్కుకున్న వారి పరిస్తితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అంటూ చెప్పుకొచ్చారు.
"ఎయిర్‌బిఎన్‌బి యుద్ధకాలంలో కమ్యూనికేషన్ రంగంలో ఎంతో ఆచరణాత్మకంగా ఉంటుందని ఐదేళ్ల క్రితం ఎవరైనా చెబితే.. నవ్వేసి, కొట్టిపడేసేవాళ్లం.. కానీ ఇప్పుడని కార్యరూపంగా చూస్తున్నాం’ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో నిర్వాసితులుగా మారుతూ అక్కడినుంచి వెళ్లిపోతున్న 100,000 మందికి ఉచిత స్వల్పకాలిక బసను అందిస్తామని Airbnb గత వారం ప్రకటించింది. ఫ్రాన్స్‌లోని 2,800 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28,000 ఎయిర్‌బిఎన్‌బి హోస్ట్‌లు ప్రస్తుతం శరణార్థులకు వసతిని అందిస్తున్నాయి. ఎయిర్ బిఎస్ బి శరణార్థుల నిధికి 1.2 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విరాళాలు అందించినట్లు కంపెనీ తెలిపింది.
