ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పంది.  ఎయిర్ ఇండియా విమానం అదుపుతప్పి.. బిల్డింగ్ ని ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో 179మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన స్వీడన్ రాజధాని స్టాక్ హాల్మ్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. కాగా.. అదృష్టవశాత్తు.. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కూడా కాలేదని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు.

బుధవారం సాయంత్రం 5గంటల 45 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టర్మినల్ 5కి 50మీటర్ల దూరంలో ఉందనగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. టర్మినల్ కి చేరుకుంటున్న సమయంలో.. విమానం ఎడమవైపు రెక్క  సమీపంలోని బిల్డింగ్ కి ఢీకొని.. ఇరుక్కుపోయింది. వెంటనే పైలెట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని ప్రయాణికులను సురక్షితంగా ఇతర వాహనాల్లో తరలించారు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.