ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన పై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికాను టార్గెట్ చేసుకుంటూ భారత్ పైనా విమర్శలు చేసింది. అమెరికా స్వార్థపూరిత క్రీడలో పాల్గొనవద్దని వార్నింగ్ ఇచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు చైనా అధికారిక మీడియా సంచలన వ్యాఖ్యలు చేసింది. చైనా ఆర్థిక పురోగతిని దెబ్బతీయాలని భారత్‌ను అమెరికా వాడుకునే ప్రయత్నాల ఉధృతంగా చేస్తున్నదని ఆరోపించింది. ది గ్లోబల్ టైమ్స్‌లో ప్రముఖ చైనా దౌత్యవేత్త, చైనా మాజీ విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఓ అభిప్రాయం రాశారు. అమెరికా భౌగోళిక రాజకీయాల లెక్కలు వేసుకునే భారత్‌తో అమెరికా ఆర్థిక, ఇతర సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలన్నీ విఫలం కాక తప్పవని అభిప్రాయపడ్డారు.
‘2014 తర్వాత ప్రధానమంత్రి అయ్యాక ఇది నరేంద్ర మోడీ ఆరో అమెరికా పర్యటన. ఇది తొలి అమెరికా స్టేట్ విజిట్. చైనాతో భారత్‌ను తలపడేలా చేయడానికి, చైనా ఆర్థిక వృద్ధిని దెబ్బ తీయడానికి అమెరికా సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నది. ఫైనాన్షియల్ టైమ్స్ ఇటీవలే ఓ హెచ్చరిక చేసింది. మోడీపై అమెరికా మక్కువకు ఓ లెక్క ఉన్నది. దానికో ధర ఉన్నది. అమెరికా చేస్తున్న ఆకట్టుకునే ప్రయత్నాలు కొందరు భారతీయులకు గిట్టడం లేదు. చైనా టార్గెట్‌గా భారత్‌ను అమెరికా ఒక రక్షణ వలయంగా వాడుకుంటున్నది’ అని ఆ ఎడిటోరియల్ కథనం పేర్కొంది.
‘అమెరికా భౌగోళిక రాజకీయాలను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అనేక భారతీయ ప్రముఖులు భయపడుతున్నట్టు భారత్‌తో అమెరికా బలోపేతం చేసుకుంటున్న వాణిజ్య, ఆర్థిక సంబంధాలు చైనా ఆర్థిక వృద్ధిని మందగించాలనే లక్ష్యంగా సాగుతున్నవే. అమెరికా చేస్తున్న ఈ భౌగోళిక రాజకీయ అంచనాలు పట్టుతప్పక మనదు. ఎందుకంటే అంతర్జాతీయంగా చైనా సప్లై చైన్ బలంగా ఉన్నది’ అని ఆయన వివరించారు.
Also Read: అమెరికా, ఈజిప్ట్ దేశాల 5 రోజుల పర్యటన కోసం బయలుదేరిన మోదీ.. ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారంటే..
‘అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నా.. వాటికి చైనాతో వేరు పడటం సాధ్యం కావడం లేదు. ఉదాహరణకు యాపిల్ చైనా సప్లై చైన్‌కు ప్రత్యామ్నం లేదు’ అని పేర్కొన్నారు.
అమెరికా భారత్‌కు కేవలం మాట సహాయం మాత్రమే చేస్తుందని, దాని సహాయం మాటలకే పరిమితమై ఉంటుందని, అరుదుగా సహాయం చేస్తుందని ఆయన తెలిపారు.
అమెరికాతో భారత్ వాణిజ్యం.. చైనాతో వాణిజ్యాన్ని భర్తీ చేయలేదు. చైనాను గ్లోబల్ సప్లై చైన్‌గా భారత్ భర్తీ లేదని వివరించారు. ఒక వేళ అమెరికా, భారత్‌లు తదుపరి సంబంధాలను బలోపేతం చేయాలనుకుంటే.. ముందుగా ఆ రెండు దేశాలు వాటి మధ్య ఉన్న విభేదాలను తొలగించుకోవాలని వివరించారు.
