ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌‌లోని హామీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం మరోసారి పేలుడు సంభవించింది. దీనిపై కొద్దిగంటల క్రితమే అమెరికా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆత్మహుతి దాడులు జరగొచ్చని , అప్రమత్తంగా వుండాలని అగ్రరాజ్యం హెచ్చరించిన కొద్దిగంటల్లోనే ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఈ నెల 22న కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో దాదాపు 200 మంది వరకు ప్రజలు మరణించారు. వీరిలో అమెరికా సైనికులు కూడా వున్నారు. ఈ మారణకాండకు కారణమైన ఐసిస్ కే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ కుట్రకు సూత్రధారిగా వున్న వ్యక్తిని డ్రోన్ దాడుల్లో అగ్రరాజ్యం హతమార్చింది.