ఆఫ్ఘనిస్తాన్ లో కూలిన సైనిక విమానం..25మంది మృతి

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 31, Oct 2018, 12:38 PM IST
Afghanistan army helicopter crash: Senior officials among 25 dead
Highlights

ఫరా ప్రావిన్స్ లో ఈ విమానం కూలినట్లు అధికారులు గుర్తించారు. 

ఆఫ్ఘనిస్తాన్ లో సైనిక విమానం కూలింది. ఫరా ప్రావిన్స్ లో ఈ విమానం కూలినట్లు అధికారులు గుర్తించారు. సీనియర్ అధికారులు సహా.. 25మంది సైనికులు విమానంలో ప్రయాణిస్తుండగా.. అది కూలిపోయింది. ఈ ఘటనలో 25మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. 

ఈ రోజు ఉదయం 9:10గంటలకు ఫరా ప్రావిన్స్‌లో హెలికాప్టర్ కూలిపోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.మృతుల్లో ఫరా ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యులు సహా జాఫర్ మిలటరీ కార్ప్స్ చెందిన సీనియర్ అధికారులు ఉన్నారనీ... ఒక్కరు కూడా సజీవంగా బయటపడలేదని జాఫర్ మిలటరీ కార్ప్స్ ప్రతినిధి నజీబుల్లా నజీబీ వెల్లడించారు. కొండప్రాంతమైన అనార్ దారా జిల్లా నుంచి హెరాత్ ప్రావిన్స్‌కు బయల్దేరిన కొద్ది సేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్టు ఫరా గవర్నర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

loader