తాలిబాన్ల ఫత్వాలను ధిక్కరిస్తూ ఆఫ్ఘనిస్తాన్ మహిళలు సోషల్ మీడియాలో సరికొత్త ఉద్యమానికి తెరతీశారు. బుర్కా తమ సంస్కృతిలో లేనే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. అంతేనా, వారి సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించి ఫొటోలు తీసి షేర్ చేసుకుంటున్నారు.

న్యూఢిల్లీ: ధరించడానికి ఇదీ సరైన డ్రెస్ అని చెప్పడానికి ఏదైనా కొలబద్ద ఉంటుందా? అదీ మహిళలకు ప్రత్యేకంగా ఉంటుందా? ఎవరికి నచ్చిన వస్త్రధారణ వారు ఎంచుకుంటారని కామన్ సెన్స్‌ చెబుతుంది. కానీ, దురదృష్టవశాత్తు ప్రపంచంలోని పలు సంస్కృతుల్లో మహిళ వేషధారణపై పురుషుల పెత్తనమే ఎక్కువగా కనిపిస్తుంది. కచ్చితంగా ఇలాంటి వస్త్రాలే ధరించాలని, ఇలాగే నడుచుకోవాలని, ఫలానా పరిమితులు దాటవద్దని కంచె వేసినట్టు అర్థమవుతుంది. ఛాందసవాద భావాలతో మొత్తం పురుషులే ఉన్న తాలిబాన్ ప్రభుత్వం ఇందులో ఒక అడుగు ముందే ఉంటుందని అందరూ ఊహించే ఉంటారు. అందుకే అధికారంలోకి రాగానే మహిళలు కచ్చితంగా బుర్కా ధరించాలని, ఇంటి బయట అడుగుపెట్టినా తప్పకుండా ఒక ‘మగ’ తోడు ఉండాలని హుకూం జారీ చేశారు. కానీ, ఆ దేశంలో మహిళలు వణికిపోతూ సరెండర్ కాలేదు. తాలిబాన్ అధికారాలను ధిక్కరిస్తున్నారు. తాజాగా, బుర్కాపై ఆ ధిక్కరణ సోషల్ మీడియాలో కనిపిస్తున్నది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాలిబాన్ల చెబుతున్నట్టు బుర్కా ధరించడం ఆఫ్ఘనిస్తాన్ దేశ సంస్కృతిలో భాగంగా లేదని ఆ దేశ మహిళలు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి తమ సంస్కృతిని ప్రతిబింబించే వస్తాధారణ చేసి ఆ ఫొటోలను ట్వీట్లు చేస్తున్నారు. ఈ ‘ఉద్యమా’న్ని ఆఫ్ఘనిస్తాన్‌లో తొలిసారిగా జెండర్ స్టడీస్ ప్రోగ్రామ్‌ ప్రారంభించిన డాక్టర్ బహార్ జలాలీ ప్రారంభించారు. ఆమె ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతిని ప్రతిఫలించే దుస్తులు ధరించి ఫొటో తీసి ‘ఇదీ ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతి’ అని ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే ట్రెండ్ అయింది. చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ మహిళలు ‘ఇదీ ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతి’ అని తమ ఫొటోలనూ షేర్ చేస్తున్నారు.

Scroll to load tweet…

డాక్టర్ బహార్ జాలాలీ బాటలోనే డీడబ్ల్యూ న్యూస్ సర్వీస్ ఆఫ్ఘన్ హెడ్ వస్లాత్ హస్రత్ నజీమీ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

వీరి వెంటే మరికొందరు వనితలు నడిచారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ఈ ఉద్యమానికి కొందరు పురుషుల నుంచీ మద్దతు వస్తున్నది. కొందరు తమ సహోదరీల చిత్రాలు తీసి షేర్ చేసుకున్నారు.

Scroll to load tweet…