Asianet News TeluguAsianet News Telugu

వారి ముఖం, శరీరాన్ని ప్రపంచమంతా చూస్తుంది.. మహిళలు ఆటలాడొద్దు: తాలిబన్ల హుకుం

అఫ్గాన్‌ మహిళలు క్రికెట్‌ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. వారు ఆటలు ఆడేందుకు అనుమతించట్లేదని స్పష్టం చేశారు. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదని, వాటి వల్ల బాడీ ఎక్స్‌పోజింగ్‌ అవుతుందని తాలిబన్‌ కల్చరల్‌ కమిషన్‌ డిప్యూటీ హెడ్‌ అహ్మదుల్లా వాసిఖ్‌ తెలిపారు. 

afghan women not allowed to play sports
Author
Kabul, First Published Sep 8, 2021, 3:29 PM IST

అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మహిళల హక్కులపై ఇచ్చిన హామీలు నీటి మూటలే అయ్యాయి.  తాలిబన్ల రాజ్యం మొదలయ్యాక అక్కడి మహిళల హక్కులు ఒక్కొక్కటిగా హరించుకుపోతున్నాయి. షరియా చట్టాలకు అనుగుణంగానే పాలన సాగిస్తామని చెప్పిన తాలిబన్లు.. అందుకు తగినట్లుగా మహిళలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా అఫ్గాన్‌ మహిళలు క్రికెట్‌ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. వారు ఆటలు ఆడేందుకు అనుమతించట్లేదని స్పష్టం చేశారు. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదని, వాటి వల్ల బాడీ ఎక్స్‌పోజింగ్‌ అవుతుందని తాలిబన్‌ కల్చరల్‌ కమిషన్‌ డిప్యూటీ హెడ్‌ అహ్మదుల్లా వాసిఖ్‌ తెలిపారు. 

క్రీడల్లో మహిళలకు ఇస్లామిక్‌ డ్రెస్‌ కోడ్‌ ఉండదని.. అక్కడ ఆడేవారి ముఖం, శరీరం కవర్‌ చేసుకోలేరని వాసిఖ్ అన్నారు.  మీడియా ద్వారా వారి ఫొటోలు, వీడియోలను ప్రపంచమంతా చూస్తారు. మహిళలు అలా కన్పించడాన్ని ఇస్లామిక్‌ ఎమిరేట్‌ (తాలిబన్ల ప్రభుత్వం) అంగీకరించదు. అందువల్ల మహిళలకు క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతినివ్వట్లేదు అని వాసిఖ్‌ వెల్లడించారు.

Also Read:పీహెచ్‌డీలు, పీజీ డిగ్రీలు అన్నీ వేస్ట్.. వారందరికంటే ముల్లాలు గ్రేట్: తాలిబాన్ విద్యా శాఖ మంత్రి

కాగా, అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు గతేడాదే 25 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్‌లు ఇచ్చింది. ఇప్పుడు వారి భవితవ్యంపై ఆందోళన నెలకొంది. మరోవైపు ఇప్పటికే ఆ దేశ మహిళా ఫుట్‌బాల్‌ జాతీయ జట్టు సభ్యులు తమ జెర్సీలను తగలబెట్టినట్లు వార్తలు వచ్చాయి. అటు చదువుకునే అమ్మాయిలపైనా తాలిబన్లు అనేక ఆంక్షలు విధించారు. అమ్మాయిలకు పురుష టీచర్లు బోధించొద్దని విద్యాసంస్థలను ఆదేశించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా బుర్ఖా, నికాబ్‌ ధరించాలని, క్లాసుల్లో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య పరదా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అబ్బాయిలు క్యాంపస్‌ నుంచి పూర్తిగా బయటకు వెళ్లిన తర్వాతే అమ్మాయిలను పంపించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios