Asianet News TeluguAsianet News Telugu

Afghanistan: శవాలపైనా అత్యాచారం చేస్తారు, తాలిబాన్లపై వ్యాఖ్యలు

తాలిబాన్లు.. శవాలపై కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారని ఆమె పేర్కొనడం గమనార్హం. అఫ్గన్‌ తాలిబన్ల హస్తమగతమైన నేపథ్యంలో ఆమె భారత్‌కు శరణార్థిగా వచ్చారు. ఈ క్రమంలో తమ దేశంలోని భయానక పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు వెల్లడించారు. 

afghan women comments on taliban
Author
Hyderabad, First Published Aug 25, 2021, 8:48 AM IST

ఆప్ఘనిస్తాన్.. తాలిబాన్ల వశమైంది.  కాగా.. దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబాన్లు.. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారని తెలుస్తోంది. కాగా.. తాలిబాన్ల అరచకాలను భరంచే శక్తి తమకు లేదని.. అందుకే తాను దేశం విడిచి పారిపోయి వచ్చినట్లు ఆప్ఘనిస్తాన్ కి చెందిన ముస్కాన్ అనే  మహిళ పేర్కొన్నారు. తాలిబాన్లు.. శవాలపై కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారని ఆమె పేర్కొనడం గమనార్హం.

అఫ్గన్‌ తాలిబన్ల హస్తమగతమైన నేపథ్యంలో ఆమె భారత్‌కు శరణార్థిగా వచ్చారు. ఈ క్రమంలో తమ దేశంలోని భయానక పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు వెల్లడించారు. ‘‘ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను పంపించాలని తాలిబన్‌ ఫైటర్లు కోరతారు. ఎవరైనా తమతో రావడానికి నిరాకరిస్తే కాల్చి చంపేస్తారు. మృతదేహాలపై కూడా వాళ్లు లైంగికదాడికి పాల్పడతారు. ఒక మనిషి బతికుందా లేదా చచ్చిపోయిందా అన్న విషయాలతో వాళ్లకు సంబంధం ఉండదు. అక్కడ మా పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఒక్క విషయం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. 

ఇక ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగానికి వెళ్లే మహిళల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారితో పాటు వారి కుటుంబాలు కూడా ప్రమాదంలో పడినట్లే. ఒక్కసారి వార్నింగ్‌ ఇచ్చాక వినలేదంటే.. మరోసారి వార్నింగ్‌ కూడా ఉండదు. అంతం చేయడమే’’ అంటూ తాలిబన్ల అరాచకాల గురించి చెప్పుకొచ్చారు. కాగా తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా తాలిబన్లు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. కో ఎడ్యుకేషన్‌ రద్దు చేయడం, వేశ్యా గృహాల్లో జంతువులను ఉంచడం ద్వారా తమ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios