ఆఫ్గానిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ మరణించినట్లు తాలిబన్లు ప్రకటించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లుగా వెల్లడించారు

ఆఫ్గానిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ మరణించినట్లు తాలిబన్లు ప్రకటించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లుగా వెల్లడించారు.

జలాలుద్దీన్ హక్కానీ 1980లలో అఫ్గాన్ ముజాహిదీన్ కమాండర్‌గా సోవియట్ దళాలకు వ్యతిరేకంగా పోరాడారు. జలాలుద్దీన్ అరబిక్‌ను అనర్గళంగా మాట్లాడేవారు. ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌తో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆఫ్గనిస్తాన్ తాలిబన్ నేతలతో ఏర్పాటైన క్వెట్టా షురాలో కూడా హక్కానీ సభ్యుడు. హక్కానీ కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ ప్రస్తుతం తాలిబన్‌కు డిప్యూటీ చీఫ్‌గా, మిలటరీ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు.