కుక్కలకు మనుషులకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేల ఏళ్లుగా మనిషి శునకాలను మచ్చిక చేసుకుని ఇంటిలో పెంపుడు జంతువుగా ఉంచుకున్న సంగతి తెలిసిందే.

అలాంటి కుక్కలు అప్పుడప్పుడు చేసే పనులు యజమానులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే దక్షిణాఫ్రికాలో జరిగింది. ఓ అమ్మాయి పెప్పర్ అనే కుక్కను ప్రేమగా పెంచుకుంటోంది.

Also Read:రెండో ప్రపంచ యుద్ధం విడదీసింది.. 78ఏళ్ల తర్వాత కలిసిన అక్కాచెల్లెళ్లు

అయితే ఈ మధ్యే ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. నిశ్చితార్ధం కోసం ఖరీదైన రింగుని కొని ఇంట్లో పెట్టుకున్నారు. కానీ అనుకోకుండా పెంపుడు కుక్క పెప్పర్ ఆ రింగుని మింగేసింది. ఈ విషయాన్ని వ్యాలీ ఫామ్ అనే పశువుల హాస్పిటల్‌ తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.

కుక్క ఫోటోతో పాటు దాని కడుపులో ఉన్న రింగ్.. దానికి సంబంధించిన ఎక్స్‌రే రిపోర్టును జతచేసింది. ఈ విషయం గురించి ఆసుపత్రి వర్గాలు రాసిన ఫన్ని కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read:పీరియడ్స్ వస్తే.. మైనర్ అయినా పెళ్లి కి ఒకే .. కోర్టు షాకింగ్ తీర్పు

‘‘ నా ముద్దు పేరు పెప్పర్.. చూడటానికి బాగా వీక్‌గా కనిపిస్తున్నా కదా.. అవును ఇప్పుడే డాక్టర్ నాకు వాంతులు అవ్వడానికి మందు ఇచ్చాడు. డాక్టర్‌కు ఏం చేయ్యాలో తోచక అలా చేశారనుకోండి.

ఎందుకంటే తాను మా మమ్మీ (పెళ్లికూతురు) రింగు తినేశా.. ఆ టైంలో అదే కరెక్ట్ అనుకోని అలా చేశా.. ఇంకేమీ అడగొద్దు అంటూ పోస్ట్ చేశారు. దీనిని నెటిజన్లు షేర్ చేస్తూ నచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు.