మెల్బోర్న్ కారు ప్రమాదంలో హైదరాబాదీ మృతి

Accident kills Hyderabad youth in Melbourne
Highlights

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన కారు ప్రమాదంలో హైదరాబాదు యువకుడు మరణించాడు. 

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన కారు ప్రమాదంలో హైదరాబాదు యువకుడు మరణించాడు. మృతుడిని 35 ఏళ్ల యూసుఫ్ తహ్నియత్ మెహదీగా గుర్తించారు. మెహదీ ప్రయాణిస్తున్న కారు మరో కారును మనోర్ లేక్స్ లోని బల్లన్ రోడ్డులో గురువారం ఢీకొట్టింది. 

మెహదీ 1998 నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పని ముగించుకుని గురువారం ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఆ ప్రమాదం జరిగింది. 

మెహిదీ అక్కడికక్కడే మరణించాడు. మెహిదీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చి ఢీకొట్టిన కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. మెహిదీ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడానికి సహాయం అందించాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను, తెలంగాణ ఎన్నారై వ్యవహారాల మంత్రి కెటి రామారావును హైదరాబాదులోని ఆయన కటుుంబ సభ్యులు కోరారు 

loader