పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కి ఘోర అవమానం

AC, Television And More: Sharifs Qualify For Class 'B' Cells In Pak Jail
Highlights

. జైలు శిక్షలో భాగంగా నవాజ్ షరీఫ్ ని జైలులో చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు పాకిస్థాన్ కి ఆయన ప్రధానిగా ఉన్నారు కాబట్టి.. కనీస సదుపాయాలు కల్పిస్తారని అంతా భావించారు. కానీ ఆయను బీ క్లాస్ సెల్ లో ఉంచారు. 
 

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ కి పాకిస్థాన్ జైలులో ఘోర అవమానం జరిగింది. పనామా పత్రాలు, అవినీతి కేసుల్లో, లండన్‌లో అక్రమాస్తుల సంపాదన.. తదితర ఆరోపణలు రుజువు కావటంతో అకౌంటబిలిటీ కోర్టు.. నవాజ్‌ షరీఫ్‌(68)కు పదేళ్లు, ఆయన కూతురు మర్యమ్‌(44) ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

అయితే.. జైలు శిక్షలో భాగంగా నవాజ్ షరీఫ్ ని జైలులో చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు పాకిస్థాన్ కి ఆయన ప్రధానిగా ఉన్నారు కాబట్టి.. కనీస సదుపాయాలు కల్పిస్తారని అంతా భావించారు. కానీ ఆయను బీ క్లాస్ సెల్ లో ఉంచారు. 

పాక్‌లో నేరం తీవ్రత ఆధారంగా జైల్లో సదుపాయాల కల్పన ఉండదు. ఎంతటి నేరాలు చేసినా.. సోసైటీలో అప్పటిదాకా వారికి ఉండే హోదా, వారి ఆర్థిక స్థితిగతులు, విద్యార్హతలు ఆధారంగానే ట్రీట్‌మెంట్‌ అందుతుంది. అయితే ఏ క్లాస్‌ కాకుండా బీ క్లాస్‌ గదులను నవాజ్‌కు కేటాయించటం చర్చనీయాంశంగా మారింది. 

గదిలో ఓ మంచం, ఓ కుర్చీ, చెంబు, మరుగుదొడ్డి సదుపాయం మాత్రమే ఉంటాయి. ఒకవేళ న్యాయస్థానం అనుమతిస్తే.. గదిలో ఫ్రిజ్‌, ఏసీ, టీవీ సదుపాయాలను కల్పిస్తారు.  అయితే మరియమ్‌కు  మాత్రం ఊరటనిచ్చిన అధికారులు.. సీహాలా రెస్ట్‌ హౌజ్‌కు తరలించి తాత్కాలిక సబ్‌జైలును ఏర్పాటు చేశారు. జైల్లో నవాజ్‌కు బీ కేటగిరీ సదుపాయాలు కల్పించటంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) కార్యకర్తలు మండిపడుతున్నారు.

loader