వాషింగ్టన్: ప్రతి రోజూ తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లు వేసుకొంటున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్గ్ ట్రంప్ ప్రకటించారు. గత 10 రోజుల నుండి ఈ మందును తాను క్రమం తప్పకుండా తీసుకొంటున్నట్టుగా చెప్పారు.

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే సుమారు 80 వేలకు పైగా మృత్యువాత పడ్డారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.

శ్వేత సౌధంలోని వైద్యులు సూచించకపోయినా కూడ తాను మాత్రం ఈ మందులు వాడుతున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ మందులు తాను వాడుతున్న విషయమై వైద్యుడితో చెబితే అతను కూడ అభ్యంతరం లేదని ట్రంప్ మీడియాకు చెప్పారు.

also read:పదేళ్ల తెలుగు బాలికను సన్మానించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ప్రతి రోజూ ఒక్క మాత్ర వేసుకొంటున్నానని చెప్పారు. కరోనా నివారణలో ఈ మందును ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ మందు కరోనా రోగుల్లో మంచి ఫలితాలను తెచ్చిందని ఆయన చెప్పారు. అందుకే ఈ మందును ఉపయోగిస్తున్నానని ట్రంప్ స్పష్టం చేశారు.

గత మాసంలో ఇండియా నుండి పెద్ద ఎత్తున హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ అమెరికాకు ఎగుమతి అయిన విషయం తెలిసిందే.ఈ డ్రగ్ కోసం ఇండియాపై ట్రంప్ ఒకాకొన దశలో బెదిరింపు ధోరణిలో కూడ మాట్లాడిన విషయం తెలిసిందే.

ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టుగా వైట్ హౌస్ వర్గాలు సోమవారం నాడు ప్రకటించాయి. తరచుగా ట్రంప్ కరోనా పరీక్షలు చేయించుకొన్నాడని... అతనికి కరోనా సోకలేదని వైట్ హౌస్ ప్రకటించింది.