ఉక్రెయిన్‌కు చెందిన 98 ఏళ్ల వృద్ధురాలు రష్యాపై పోరాడటానికి సిద్ధం అంటూ ముందుకు వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆమె ఇప్పుడు రెండో యుద్ధాన్ని చూస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలోనూ ఉక్రెయిన్ కోసం ఆమె పోరాడారు. తాజాగా, వయసు దృష్ట్యా ఆమె విజ్ఞప్తిని ఉక్రెయిన్ తిరస్కరించింది. 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ తరఫున కదనరంగంలో దూకడానికి ఎందరో సామాన్యులు సిద్ధం అయ్యారు. ముందస్తుగా నిర్వహించిన గన్ ట్రెయినింగ్ సెషన్‌లోనూ ఆ దేశ పౌరులు చురుకుగా పాల్గొన్నారు. అందులో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది ముందుకు వచ్చారు. తాజాగా, అలాంటి పరిణామమే ఎదురైంది. 98 ఏళ్ల వృద్ధురాలు ఉక్రెయిన్ సైన్యం తరఫున బరిలోకి దిగి రష్యా సైన్యంపై యుద్ధం చేయడానికి సిద్ధం అని ప్రకటించారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఆమె ఉక్రెయిన్ దేశం కోసం పోరాడారు. ఆ యుద్ధంలో విజయాన్ని ఆమె కళ్లారా చూశారు. ఇప్పుడు తమ దేశానికి మరో ఉత్పాతం వచ్చింది. ఈ సారి రష్యా రూపంలో వచ్చింది. రెండో సారి యుద్ధాన్ని చూస్తున్న ఆమె మళ్లీ తన మాతృభూమి కోసం పోరాటంలోకి దిగాల్సిందేనని అనుకున్నారు. ఉక్రెయిన్ మిలిటరీకి ఆఫర్ చేశారు.

Scroll to load tweet…

ఆర్మీలో చేరి యుద్ధం చేయడానికి ఆమెకు అన్ని నైపుణ్యాలూ ఉన్నాయి. అర్హతలూ ఉన్నాయి. కానీ, వయసును దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ ఆర్మీ ఆమె ఆఫర్‌ను వెనక్కి పంపింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 98 ఏళ్ల ఒల్హ ట్వెర్డోఖ్లిబొవా రెండో ప్రపంచ యుద్ధాన్ని ఫేస్ చేశారని పేర్కొంది. ఆమె తన జీవితంలో రెండో యుద్ధాన్ని చూస్తున్నారని వివరించింది. ఇప్పుడూ తన మాతృభూమిని కాపాడుకోవడానికి రెడీగా ఉన్నారని, ఆమె అన్ని విధాల అర్హురాలే అయినా వయసు దృష్ట్యా ఆమెను విజ్ఞప్తిని తిరస్కరించామని తెలిపింది. అయితే, నిరాశ పడాల్సిన అవసరమేమీ లేదని, ఉక్రెయిన్ త్వరలోనే విజయం సాధిస్తుందని, ఆ విజయోత్సవాలను ఆమె కూడా వేడుక చేసుకుంటుందని పేర్కొంది.

Scroll to load tweet…

ఆ పోస్టుకు సోషల్ మీడియాలో విశేష ఆదరణ వచ్చింది. చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఆ బామ్మపై లైక్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.

Scroll to load tweet…
Scroll to load tweet…