Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్: పంజ్‌షీర్‌పై ఫోకస్.. తలవంచని మసౌద్ సేనలు, 8 మంది తాలిబన్ల హతం

సోమవారం రాత్రి పంజ్‌షీర్‌పై దాడికి తెగబడిన తాలిబన్లకు మరోమారు పరాభవం ఎదురైంది. తాలిబన్ వ్యతిరేక దళాల నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అంతేకాదు, ఈ పోరులో తాము ఏడు నుంచి ఎనిమిదిమంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు అహ్మద్ మసౌద్ అధికార ప్రతినిధి ఫాహిత్ దష్తీ తెలిపారు. 

8 Taliban Killed In Panjshir Province Fighting
Author
Kabul, First Published Aug 31, 2021, 5:26 PM IST

ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించిన తాలిబన్లకు పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం కొరకరాని కొయ్యగా మారింది. 1996-2001 మధ్యకాలంలోనూ ఈ ప్రాంతం తాలిబన్లకు లొంగలేదు. దీంతో తమకు అందని ద్రాక్షగా మారిన పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను ఈసారి ఎట్టి పరిస్దితుల్లోనూ వదిలేది లేదని చెబుుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్ గడ్డ నుంచి అమెరికా సేనలు ఇలా వెళ్లిపోయాయో, లేదో.. పంజ్‌షీర్‌పై తాలిబన్లు విరుచుకుపడ్డారు. సోమవారం రాత్రి పంజ్‌షీర్‌పై దాడికి తెగబడిన తాలిబన్లకు మరోమారు పరాభవం ఎదురైంది. తాలిబన్ వ్యతిరేక దళాల నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అంతేకాదు, ఈ పోరులో తాము ఏడు నుంచి ఎనిమిదిమంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు అహ్మద్ మసౌద్ అధికార ప్రతినిధి ఫాహిత్ దష్తీ తెలిపారు. అలాగే ఇరువైపులా కొందరికి గాయాలైనట్టు పేర్కొన్నారు.  

Also Read:ఆఫ్ఘన్‌ను వీడిన అమెరికా దళాలు: మొదలైన తాలిబన్ల ఊచకోత.. హెలికాఫ్టర్ పైనుంచి ఉరితీత, ఇది ట్రైలర్ మాత్రమే

అటు పంజ్‌షీర్‌లో తాలిబన్ వ్యతిరేక దళాలతో చేతులు కలిపిన ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలే సామాజిక మాధ్యమాల ద్వారా బాహ్య ప్రపంచానికి మెసేజ్‌లు పంపకుండా ఉండేందుకు గాను తాలిబన్లు ఆదివారం పంజ్‌షీర్‌లో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు అధీనంలోకి తీసుకున్న తర్వాత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోయారు. దీంతో అమృల్లా తనకు తానుగా ఆఫ్ఘనిస్థాన్‌కు చట్టబద్ధమైన కేర్ టేకర్‌గా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios