Asianet News TeluguAsianet News Telugu

వయాగ్రా కోసం వెళ్లి..8మంది మృతి

వయాగ్రా కోసం వెళ్లి... 8మంది మృత్యువాత పడ్డారు. మీరు చదివింది నిజమే. కాకపోతే ఇది మీరు అనుకునే వయాగ్రా  కాదు. దుకాణాల్లో లభించే వయాగ్రా కాదు ఇది.

8, Including Toddler, Die Collecting "Himalayan Viagra" In Nepal
Author
Hyderabad, First Published Jun 7, 2019, 12:29 PM IST

వయాగ్రా కోసం వెళ్లి... 8మంది మృత్యువాత పడ్డారు. మీరు చదివింది నిజమే. కాకపోతే ఇది మీరు అనుకునే వయాగ్రా  కాదు. దుకాణాల్లో లభించే వయాగ్రా కాదు ఇది. అంతకు మించి  ఎక్కువ పవర్ గల వయాగ్రా. హిమాలయాల్లో లభించే ఔషద మొక్క  యార్సాగుంబా. దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ.. దీని కోసం నేపాల్  ప్రజలు హిమాయాలు ఎక్కి మరీ ఆ ఔషద మొక్కను సేకరిస్తారు. తర్వాత దానిని విక్రయిస్తూ ఉంటారు.

 కాగా తాజాగా యార్సాగుంబా కోసం హిమాలయాలు ఎక్కిన 8 మందిలో ఐదుగురు ఆనారోగ్యంతో మరణించారని, ఇద్దరు అత్యంత ఖరీదైన వనమూలిక పీకే క్రమంలో కొండపై నుంచి జారిపడి తుదిశ్వాస విడిచారన్నారు. ఇక తన తల్లితో వెళ్లిన ఓ చిన్నారి సైతం అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

ఒక కిలో యార్సాగుంబా ధర రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే. గ్రామీణ నేపాల్‌లో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ కుటుంబాలు పోరాడుతున్నాయి.  యార్సాగుంబా కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు.  పసుపు పచ్చ రంగులో ఉండే ఇది బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడంతో పాటు పుష్కలమైన ఔషధ గుణాలు ఈ మూలిక సొంతం. 

Follow Us:
Download App:
  • android
  • ios