పెరూలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విమానంలోని ఏడుగురు మృత్యువాత పడ్డారు. విహారంకోసం వెళ్లిన వారి జీవితాలో విషాదాంతం అయ్యాయి. చారిత్రక ప్రదేశాలు చూడాలని వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

పెరూ : Peru దేశంలో Tourist plane కుప్పకూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. ఏరోసాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన సెస్నా 207 సింగిల్ ఇంజిన్ విమానం నజ్కా లోని మరియా రీచీ విమానాశ్రయం నుంచి 
Takeoff అయిన కొద్దిసేపటికి crashe అయి కుప్పకూలిపోయింది. పెరూలోని ప్రసిద్ధ Nazca linesను వీక్షించేందుకు వెళ్లిన వారి విమానం కూలిపోవడంతో ఐదుగురు పర్యాటకులు, ఇద్దరు పైలెట్లు మరణించారని పెరూ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. 

సెస్నా 207 సింగిల్ ఇంజన్ విమానంలో ఉన్న ఏడుగురిలో ఎవరూ ప్రాణాలతో లేరని అధికారిక వర్గాలు తెలిపాయి. విమానంలో ఉన్న ఏడుగురిలో ఇద్దరు చిలీ పర్యాటకులు ఉన్నారని దౌత్య అధికారి తెలిపారు. మరియా రీచ్ ఎయిర్ ఫీల్డ్ నుంచి డజన్ల కొద్దీ విమానాలు నడుస్తున్నాయి. విదేశీ పర్యాటకులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన నాజ్కా లైన్ ల మీదుగా విమానాల్లో ప్రయాణిస్తూ వీక్షిస్తుంటారు. 2010లో అక్టోబర్ లో ఎయిర్ నాస్కా ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు నలుగురు బ్రిటీష్ పర్యాటకులు, ఇద్దరు పెరూవియన్ సిబ్బంది మరణించారు. 

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 16న డొమినికన్ రిపబ్లిక్ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని శాంటో డొమింగోలోని లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ప్రైవేట్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ మేరకు ప్రమాదానికి గురైన విమాన ఆపరేటర్ హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ తెలిపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మరణించారని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికుల్లో ఆరుగురు విదేశీయులని, ఒకరు డొమినికన్ అని పేర్కొంది. 

అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానికి మాత్రం Helidosa Aviation Group కారణాలు వెల్లడించలేదు. సిబ్బంది విమానాన్ని ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో సేవలను నిలిపివేశారు. కొన్ని ఫ్లైట్స్ సర్వీసులను రద్దు చేశారు. 

ఈ ప్రైవేట్ విమానం డొమినికన్ రిపబ్లిక్‌లోని లా ఇసాబెల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది. ఇక, ఈ లాంగ్ రేజ్ GIVSP ఫ్లోరిడాలోని మియామికి వెళ్తున్నట్టుగా హెలిడోసా సంస్థ తెలిపింది. ‘ఈ ప్రమాదం మాకు చాలా బాధను, దుఃఖాన్ని కలిగిస్తుంది. మాతో పాటు ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి, సంఘీభావంగా నిలవాలని మేము కోరుతున్నాము’ అని హెలిడోసా ఏవియేషన్ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. 

మృతుల్లో ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసర్, అతని కుటుంబం
మృతుల్లో ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌ జోస్ ఏంజెల్ హెర్నాండెజ్, అతని భార్య, కొడుకు మృతిచెందారు. మిగిలిన వారు కూడా హెర్నాండెజ్ సన్నిహితులుగా తెలుస్తోంది. ఇక, Flow La Movieతో హెర్నాండెజ్‌కు పాపులారిటీ వచ్చింది. Te Bote జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అతని సన్నిహితులు, అభిమానులు షాక్ తిన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.