జకార్తా:  ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.  భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. గంటల వ్యవధిలోనే ఇండోనేషియాలో రెండు దఫాలు భూకంపం సంభవించింది.

ఆదివారం రాత్రి పది గంటల సమయంలో  భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున కూడ భూకంపం చోటు చేసుకొంది. ఆదివారం చోటు చేసుకొన్న భూకంప తీవ్రత 7.5 గా నమోదు కాగా, సోమవారం నాడు తెల్లవారుజామున చోటు చేసుకొన్న భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్టుగా భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు.

యాంబన్‌కు దక్షిణాన 321 కి.మీ దూరంలో బండా సముద్ర తీరంలో భూమికి 2141 కి.మీ లోపల భూకంప కేంద్రం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.  భూకంపం తో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సునామీ కూడ వచ్చే అవకాశం ఉందని  కూడ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.