Asianet News TeluguAsianet News Telugu

నోబెల్ అందుకున్న భార్యాభర్తలు వీరే

నోబెల్ బహుమతులు ప్రారంభమైన నాటి నుంచి నేటీ వరకు ఐదుగురు దంపతులకు నోబెల్ బహుమతి దక్కగా.. సోమవారం ఆర్ధిక శాస్త్రంలో మరో జంట సంయుక్తంగా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికై రికార్డుల్లోకి ఎక్కింది. 

6 Married couples who have won the Nobel Prize
Author
Stockholm, First Published Oct 14, 2019, 4:58 PM IST

నోబెల్ బహుమతి.. ప్రపంచంలో ఒక అత్యున్నత పురస్కారం. ఎంతోమంది శాస్త్రవేత్తలు, సామాజిక వేత్తలు జీవితంలో ఒక్కసారైనా నోబెల్‌ను అందుకోవాలని కలలు గంటారు. ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం భౌతిక, రసాయన, సాహిత్యం, వైద్య శాస్త్రం, ప్రపంచ శాంతికి కృషిన వ్యక్తులకు ప్రతి ఏటా నోబెల్‌ను అందజేస్తారు.

ఒక్క శాంతి బహుమతి తప్పించి మిగిలిన ఐదు బహుమతులు నోబెల్ వర్థంతి అయిన డిసెంబర్ 10 నాడు స్టాక్ హోంలో ప్రదానం చేస్తారు. అయితే నోబెల్ బహుమతులు ప్రారంభమైన నాటి నుంచి నేటీ వరకు ఐదుగురు దంపతులకు నోబెల్ బహుమతి దక్కగా.. సోమవారం ఆర్ధిక శాస్త్రంలో మరో జంట సంయుక్తంగా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికై రికార్డుల్లోకి ఎక్కింది. 

1. పియర్ క్యూరీ-మేరీ క్యూరీ:
రెడియో ధార్మిక శక్తిని కనుగొనడంతో పాటు యురేనియం, థోరియం మూలకాలపై పరిశోధనకు గాను 1903లో పియర్ క్యూరీ, మేరీ క్యూరీ దంపతులకు నోబెల్ బహుమతి లభించింది. రేడియం క్లోరైడ్ ద్రవం గుండా విద్యుత్ శక్తిని ప్రసరింపచేసి స్వచ్ఛమైన రేడియంను ఉత్పన్నం చేసినందుకు గాను ఆమెకు 1911లో రెండోసారి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. 

2. ఫ్రెడరిక్ జొలియట్-ఇరీన్ క్యూరీ
ప్రకృతి సిద్ధమైన రేడియో ధార్మికతల గురించి మూలతత్వాల మార్పు, న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి క్యూరీ దంపతులు ప్రయోగాలు చేశారు. ఫలితంగా రేడియో ధార్మికత మూలతత్వాల కృత్రిమ నిర్మాణం గురించి కనుగొన్నందుకు గాను భర్త ఫ్రెడరిక్‌తో కలిసి 1935లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 

3. కార్ల్ ఫెర్డినాండ్ కోరి-గెర్టీ థ్రెస్సా కోరి

గ్లైకోజెన్, గ్లూకోజ్ మెటబాలిజిమ్‌లతో పాటు కెటాలిక్ కన్‌వర్షన్ ఆఫ్ గ్లైకోజిన్‌పై పరిశోధనలకు గాను కార్ల్ ఫెర్డినాండ్ కోరి-గెర్టీ థ్రెస్సా కోరీ దంపతులకు వైద్యశాస్త్రంలో 1947లో నోబెల్ బహుమతి లభించింది. 

4. గున్నార్ మైర్డాల్-ఆల్వా మైర్డాల్

ఆర్ధిక శాస్త్రంలో ప్రయోగాలకు గాను గున్నార్ మైర్డాల్ 1974లో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. సామాజిక, రాజకీయాలతో ఆర్ధిక శాస్త్రానికి ఉన్న సంబంధాలపై గున్నార్ పరిశోధనలు చేశారు. ఈమె భార్య ఆల్వా మైర్డాల్ అణు యుద్ధాలు, నిరాయుధీకరణకు సంబంధించిన అంశాలపై రచనలు చేసినందుకు గాను 1982లో ఆల్ఫాన్సో గార్సియా రోబెస్‌తో కలిసి సంయుక్తంగా నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 

5. ఎడ్వర్డ్.ఐ.మోసర్-మే బ్రిట్ మోసర్

మెదడులో దిశానిర్దేశం జరిగే తీరును వెలుగులోకి తెచ్చినందుకు గాను ఈ జంట నోబెల్ బహుమతిని అందుకుంది. ఖాళీ ప్రదేశంలో ఉన్నప్పుడు మన స్థితిని తెలుసుకోవడానికి దోహదపడే అంతర్గత జీపీఎస్‌ను వీరు కనుగొన్నారు. అల్జీమర్స్, మెదడుకు సంబంధించిన ఇతర వ్యాధులకు చికిత్స చేయడానికి వీరి పరిశోధన దోహదపడుతుంది. 

6. అభిజిత్ బెనర్జీ-ఎస్తర్ డఫ్లో

ప్రపంచ పేదరికంపై ఈ జంట చేసిన పరిశోధనలకు, ప్రతిపాదనలకు గాను ఆర్ధిక శాస్త్రంలో 2019 ఏడాదికి గాను నోబెల్ పురస్కారం దక్కింది. అభిజిత్ భారత సంతతి వ్యక్తి.. ఆయన ఫ్రెంచ్ జాతీయురాలు ఎస్తర్ డఫ్లోను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతిని అందుకోబోతున్న రెండో మహిళగా ఆమె నిలిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios