Asianet News TeluguAsianet News Telugu

కాలిఫోర్నియాలో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. ఇద్దరు మృతి, ధ్వంసమైన ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్

కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత  6.4గా నమోదు అయ్యింది. ఈ భారీ ప్రకంపనల వల్ల అనేక రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇద్దరు మరణించారు. 11 మంది గాయపడ్డారు. 

6.4 magnitude earthquake hits California  Two dead, destroyed houses, roads, drainage system
Author
First Published Dec 21, 2022, 8:21 AM IST

కాలిఫోర్నియాలోని తీవ్ర ఉత్తర తీరంలో మంగళవారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో అనేక ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ లు దెబ్బతిన్నాయి. వేలాది మంది విద్యుత్ సౌకర్యానికి దూరమయ్యారు. హంబోల్ట్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ భూకంపం వల్ల 11 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు మరణించారు.

చైనాలో కొవిడ్ కేసులు ఉధృతం.. నిమ్మకాయలకు ఒక్క ఉదుటున పెరిగిన డిమాండ్

హంబోల్ట్ కౌంటీలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆఫ్‌షోర్‌కు ఉత్తరాన 215 మైళ్లు (350 కిమీ) కేంద్రీకృతమైన ఈ భూకంపం వల్ల దాదాపు 80 ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనలు వచ్చిన ప్రాంతం రెడ్‌వుడ్ అడవులు, స్థానిక మత్స్య, కలప పరిశ్రమ, పాడి పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే తాజా భూకంపం ఇటీవలి కాలంలో వచ్చిన దానికంటే అధికంగా ఉంది.

వార్నీ.. పేషెంట్ బాధతో అల్లాడిపోతున్నాడని మద్యం తాగించిన అంబులెన్స్ డ్రైవర్.. సోషల్ మీడియాలో వైరల్

కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ (కాల్‌ఫైర్) ప్రకారం.. మంగళవారం నాటి ప్రకంపనల వల్ల నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగాయి. మరో రెండు భవనాలు కూలిపోయాయి. అందులో పలువురు చిక్కుకుపోయారు.

భూకంపం వల్ల ఏర్పడిన నష్టం వల్ల బోల్ట్ కౌంటీలో దాదాపు నాలుగు ఇతర రహదారులు మూసివేమని స్థానిక అధికారులు తెలిపినట్టు ‘జీ న్యూస్’ వెల్లడించింది. రోడ్డు చాలా చోట్ల ధ్వంసం అయ్యాయని హైవే పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. ఫెర్న్‌డేల్ పక్కనే ఉన్న ఫోర్టునా, రియో ​​డెల్ పట్టణాలు చాలా దెబ్బతిన్నాయి. అలాగే అనేక చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios