బ్రెజిల్‌లోని ఓ జైలులో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ 57 మంది మరణానికి కారణమైంది. అల్టామిరా జైలులో పాతకక్షల కారణంగా ఓ గదిలో బంధించబడిన ఖైదీలు సోమవారం ఉదయం 7 గంటలకు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో మొత్తం 57 మంది మరణించారు.

బ్రెజిల్‌లోని ఓ జైలులో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ 57 మంది మరణానికి కారణమైంది. బ్యాంకు దొంగతనాలు, సెల్‌ఫోన్ల స్మగ్లింగ్, తుపాకులు, డ్రగ్స్ రవాణా తదితర నేరాల్లో అరెస్టైన దాదాపు 7 లక్షల యాభై వేల మంది బ్రెజిల్ జైళ్లలో మగ్గుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అక్కడ కొందరు బలమైన వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి.. తమ వర్గంలోని సభ్యుడికి సౌకర్యాలు అందించేందుకు.. ప్రత్యర్థుల నుంచి తమ వారిని రక్షించేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఈ క్రమంలో అల్టామిరా జైలులో పాతకక్షల కారణంగా ఓ గదిలో బంధించబడిన ఖైదీలు సోమవారం ఉదయం 7 గంటలకు పరస్పరం దాడులకు దిగారు.

ఈ ఘటనలో మొత్తం 57 మంది మరణించారు. ప్రత్యర్థుల దాడిలో 16 మంది తలలు తెగిపడగా.. మరికొంతమంది సజీవదహనమయ్యారు. కాలిపోయిన శరీర భాగాలు, తల లేని మొండాలతో అల్టామిరా జైలు స్మశానాన్ని తలపిస్తోంది.

ఈ ఘటన కారణంగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయర్ బోసా నారు పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ దాడికి గల కారణాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.