Asianet News TeluguAsianet News Telugu

రష్యా స్కూల్లో కాల్పులు: 9 మంది మృతి, ఆత్మహత్య చేసుకున్న నిందితుడు

సెంట్రల్ రష్యాలోని స్కూల్ లో సోమవారం నాడు జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు చిన్నారులున్నారు. 

5 Children Among 9 Dead In Russia School Shooting
Author
First Published Sep 26, 2022, 3:04 PM IST

మాస్కో: సెంట్రల్ రష్యాలోని ఇజెవ్స్క్ నగరంలోని పాఠశాలలో సోమవారం నాడు జరిగిన కాల్పుల్లో  తొమ్మిది మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో స్కూల్ కు చెందిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఐదుగురు మైనర్ విద్యార్ధులు,ఇద్దరు టీచర్లు మృతి చెందారని  రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రకటించింది.  ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  నిందితుడు నాజీ చిహ్నలు, బాలక్లావాతో నల్లటి టాప్ ధరించాడు. అయితే అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లభ్యం కాలేదు.

అయితే ఈ కాల్పుల్లో 20 మంది గాయపడ్డారని రష్యా అంతర్గత వ్యవహరాల శాఖ వెల్లడించింది. ఇజెవ్స్క్ గవర్నర్  అలెగ్జాండర్ బ్రెచలోవ్  సంఘటన జరిగిన స్కూల్ వెలుపల మీడియాతో మాట్లాడారు. స్కూల్ పిల్లల్లో మృతి చెందినవారితో పాటు గాయపడిన వారు కూడా ఉన్నారని చెప్పారు.  ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్స్ సంఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టాయి. 6,30,000 ల జనాభా ఈ నగరంలో నివాసం ఉంటారు. రష్యా ఉడ్ముర్డ్ రిపబ్లిక్ ప్రాంతీయ రాజధాని. మాస్కోకు తూర్పు దిక్కున  వెయ్యి కి.మీ. దూరంలో  ఈ నగరం ఉంటుంది. రష్యాలో  ఇటీవల కాలంలో కాల్పుల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. 2021 మే మాసంలో కజ్మాన్ నగరంలో ఓ యువకుడు  9మందిని కాల్చి చంపాడు. 
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఉలియానోవ్క్స్ ప్రాంతంలోని చిన్నపిల్లల స్కూల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలు సహ ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios