Russia Ukraine Crisis: ర‌ష్యా దాడిలో నేప‌థ్యంలో  వేలాది మంది శ‌ర‌ణార్థులు త‌ల‌దాచుకుంటున్న మారియుపోల్ థియేట‌ర్ పై బాంబు దాడి జ‌రిగింది. ఆ దాడిలో వంద‌ల సంఖ్య‌లో జ‌నం శిథిలాల కింద చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. దాడిలో ఎంత మంది మ‌ర‌ణించారో ఉక్రెయిన్‌ ప్ర‌భుత్వం ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు. ఈ క్ర‌మంలో మారియుపోల్ నుండి 1,124 మంది పిల్లలతో సహా 4,972 మందిని స‌రిహ‌ద్దు దాటి వెళ్లిపోయారు.  

Russia Ukraine Crisis: గ‌త 24 రోజులుగా ర‌ష్యాన్ దళాలు..ఉక్రెయిన్ పై విచ‌క్ష‌ణ ర‌హితంగా బాంబుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు స్మశానదిబ్బలుగా మారాయి. త‌మ న‌గ‌రాల‌ను కాపాడుకోవడాని ఉక్రెయిన్ సైన్యం కూడా వీరోచితంగా పోరాటం సాగిస్తున్నాయి. ర‌ష్యాన్ సేన‌ల‌కు దీటుగా ప్రతి ఘటనను కనబరుస్తున్నాయి. ఇలా చేయ‌డం వ‌ల్లే. ఇప్పటికి ఉక్రెయిన్ దేశాన్ని.. రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకొలేక పోయింది.

ర‌ష్యా దాడిని ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఉక్రెయిన్ కు పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి. జెలెన్ స్కీ సైన్యానికి మ‌ద్ద‌తుగా నిలిచాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలు ర‌ష్యా యుద్దాన్మోదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్ప‌టీకి.. పుతిన్ తన దాష్టీక చ‌ర్య‌ల‌ను ఆప‌డం లేదు. ఇప్పటికే కీవ్, మరియూపోల్,ఖర్కివ్, ఖేర్సన్, ఇర్ఫిన్ ను లోనిపలు భవనాలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు బాంబుల దాడులకు ధ్వంస మయ్యాయి. ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదికల ప్ర‌కారం.. దాదాపు.. 30 లక్షల మంది వరకు ఉక్రెయిన్ ను విడిచి పొరుగు దేశాల‌కు వెళ్ళిపోయారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 6.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 

 ఇప్పటికే ప‌లు దేశాలు రష్యాపై.. ఆర్థిక, వాణిజ్య, రవాణా ప‌ర‌మైన ఆంక్ష‌లను విధించాయి. ఇప్పటికే మాస్టర్ కార్డ్, వీసా, నెట్ ఫ్లీక్స్ తదితర సంస్థలు తమ సేవలన నిలిపేశాయగా.. ఆ జాబితాలోకి LG ఎలక్ట్రానిక్స్ వ‌చ్చింది. ఈ సంస్థ కూడా ఉక్రెయిన్ కు మద్ద‌తుగా నిలిచింది. పుతిన్ చేస్తున్న సైనిక చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తూ.. LG ఎలక్ట్రానిక్స్ .. దాని ఉత్పత్తులను ర‌ష్యాను నిలిపివేస్తున్న‌ట్టు తెలిపింది. త‌మ సంస్థ‌.. రష్యాకు అన్ని డెలివరీల సస్పెన్షన్ను ప్రకటించింది. ఈ దక్షిణ కొరియా సంస్థ దాని వెబ్సైట్లో సందేశాన్ని పోస్ట్ చేసింది.

ఇదిలా ఉంటే.. రష్యా బాంబు దాడి చేసిన మారియుపోల్ థియేటర్‌లో వందలాది మంది ఇంకా చిక్కుకున్నారని ప్రెసిడెంట్ జెలెన్స్కీ అన్నారు. మరియు రోజుల పురోగతి తర్వాత, ఉక్రెయిన్ శాంతి చర్చలను లాగుతున్నట్లు రష్యా ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య చర్చలు రోడ్‌బ్లాక్‌ను తాకాయి. UN అంచనాల ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 6.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 

ఈ క్ర‌మంలో మారియుపోల్ నుండి 1,124 మంది పిల్లలతో సహా 4,972 మందిని తరలించారు. మెజారిటీ జాపోరోజీకి వెళ్లిపోయింది. అలాగే.. సుమీ ప్రాంతం నుండి 4,173 మందిని తరలించిన‌ట్టు అధికారులు తెలిపారు. గ‌త 24 గంటల్లో మానవతా కారిడార్ల ద్వారా మొత్తం 9,145 మందిని తరలించినట్లు రాష్ట్రపతి కార్యాలయ అధిపతి ప్రకటించారు.

మ‌రోవైపు మారియుపోల్‌లోని ప్రసూతి ఆసుపత్రి పునరుద్ధరణకు గ్రీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ తెలిపారు. గ‌త రెండు రోజుల క్రితం ర‌ష్యా దళాలు కూల్చివేశాయి. ర‌ష్యా దాడి స‌మ‌యంలో టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ త‌న పెద్ద మ‌న‌స్సు చాటుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నష్టపోయిన పిల్లలకు సహాయం చేయడానికి ముందుకు వ‌చ్చారు. ఉక్రేనియన్ పిల్లలకు మద్దతుగా $500,000 విరాళం ప్ర‌కటించారు.