లోకంలో అప్పుడప్పుడు విచిత్ర దొంగతనాలకు సంబంధించిన వార్తలు కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలోనే ఒకటి తాజాగా జపాన్‌లో జరిగింది. ఇంతకీ ఆ దొంగతనం ఏంటో తెలుసా.. చెట్టు. చెట్టు పోతే ఇంత హడావిడి చెయ్యాలా అని మీరు అనుకోవచ్చు.

కానీ అది సాధారణ చెట్టు కాదు.. దాదాపు 400 సంవత్సరాల నాటిది. జపాన్‌‌లో షింపాకు జూనిపర్ బోన్సాయ్ రకం మొక్కకు చాలా డిమాండ్ ఉంది. ఒక్క చెట్టు విలువే దాదాపు రూ.65 లక్షల పై మాటే. ఈ క్రమంలో టోక్యోకు చెందిన సీజీ ఇమురా, ఆయన భార్య .... తన పెరటిలోని ఏడు బోన్సాయ్ మొక్కలను ఎవరో అపహరించారని సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు.

దయ చేసి వాటిని తిరిగి ఇచ్చేయాలని వేడుకున్నారు, ఆ చెట్లు ఎంతో అపురూపమైనవని, డబ్బులతో వాటిని వెల కట్టేలేమని, తమ బాధను అర్ధం చేసుకుని వాటిని తిరిగి అప్పగించాలని ప్రాధేయపడ్డారు. అంతేకాకుండా తిరిగి తమకు ఇచ్చే దాకా మొక్కలను ఎలా సంరక్షించాలో కూడా వివరించారు.