అపార్ట్‌మెంట్‌లో కాల్పులు: నలుగురి మృతి

4 People, Including Child, Shot Dead In Apparent Murder-Suicide In Astoria
Highlights

అమెరికాలోని న్యూయార్క్  నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో  జరిగిన కాల్పుల ఘటనలో  నలుగురు మరణించారు. క్వీన్స్ ప్రాంతంలోని అస్టోరియా సెక్షన్‌లోని  ఓ అపార్ట్‌మెంట్‌లో ఐదేళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందారు. 

న్యూయార్క్:అమెరికాలోని న్యూయార్క్  నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో  జరిగిన కాల్పుల ఘటనలో  నలుగురు మరణించారు. క్వీన్స్ ప్రాంతంలోని అస్టోరియా సెక్షన్‌లోని  ఓ అపార్ట్‌మెంట్‌లో ఐదేళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందారు. 

అపార్ట్‌మెంట్  మొదటి అంతస్తులో ఈ ఘటన  చోటు చేసుకొంది. ఓ వ్యక్తి ఇద్దరు మహిళలు,  ఐదేళ్ల బాలుడు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఈ నలుగురి మృతదేహాలపై తూటాల గుర్తులున్నాయి.  వీరిని కాల్చి చంపేశారని  పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ కుటుంబానికి చెందిన వారే  వీరిని హత్య చేసి ఉంటారనే అనుమానాలను  పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

మృతుల్లో ఒకరి గొంతు కోసి ఉండడం  పట్ల కూడ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఘటనా స్థలంలోనే తుపాకీని పోలీసులు స్వాధీనంచేసుకొన్నారు.  చనిపోయినవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

అయితే వీరిని ఎవరు చంపారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు న్యూయార్క్‌ పోలీసు విభాగం చీఫ్‌ ఆఫ్‌ డిటెక్టివ్స్‌ డెర్మోట్‌ షియా చెప్పారు.ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

loader