ఇటలీలోని మాస్కోలో దారుణం జరిగింది. ఓ భారతీయుడిని తోటి భారతీయుడే అతి క్రూరంగా కొట్టి చంపేశాడు. జనవరి 25న జరిగిన ఈ కిరాతక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఇటలీలోని విసెంజా ప్రావిన్స్‌లోని అర్జిగ్నానో ఈ దారుణ ఘటన జరిగింది. గత సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో స్థానిక వీధిలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో ఉడి ఉన్నాడు. ఇది గమనించిన స్థానికుడు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అక్కడ అతనికి చికిత్స అందించారు .అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొంచెం సేపటికే బాధితుడు చనిపోయాడు. 

బాధితుడు ఎవరు, ఎలా చనిపోయాడు, గాయాలకు కారణాలేంటని తెలుసుకునే క్రమంలో పోలీసులు ఘటనాస్థలిలోని సీసీటీవీ విజువల్స్ ను పరిశీలించాడు. వీటి ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

చనిపోయిన వ్యక్తితో పాటు నిందితులిద్దరూ కూడా భారతీయులేనని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన టైంలో వారు ఫుల్లుగా మద్యం తాగి ఉన్నారని పోలీసులు తెలిపారు. 

మద్యం మత్తులోనే వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే మృతుడి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇదిలా ఉంటే.. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, మిలాన్, టురిన్, బోలోగ్నా, పర్మా నగరాల్లో భారతీయులు ఎక్కువగా ఉంటారని తెలుస్తోంది. 1990 ప్రాంతంలో ఇండియా నుంచి ఇటలీకి వలసలు ఎక్కువయ్యాయి. 2020 వరకు ఇటలీలో మొత్తం రెండు లక్షల మంది భారతీయ జనాభా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.