ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో ఇప్పటివరకు 351 మంది మరణించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ప్రకటించింది.

కీవ్: Ukraineపై Russia మిలటరీ ఆపరేషన్ కారణంగా ఇప్పటివరకు ఉక్రెయిన్ లో 351 మంది మరణించారని UNO మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. మరో వైపు 707 మంది గాయపడ్డారని ఆ సంస్థ వివరించింది.

గత నెల 24వ తేదీ తెల్లవారుజాము నుండి డోనెట్స్, లుహాన్స్ ప్రాంతాల్లో రష్యా దాడుల్లో 86 మంది మరణించారు. మరో 355 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి Human Rights Bodyవిభాగం తెలిపింది. Kviv తో పాటు చెర్కాసీ, ఒడెశా, సుమీ, జాపోరోజీ,జైటోమీర్ తదితర ప్రాంతాల్లో 265 మంది మరణిస్తే, మరో 322 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమతి మానవ హక్కుల విభాగం తెలిపింది. RNBO కార్యదర్శి అెక్సీ డానిలలోవ్ ప్రకారం ఉక్రెయిన్ పై రష్యా దాడి ఫలితం 804 మందికి పైగా పిల్లలు గాయపడ్డారు.ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలను విధించాయి. ఆర్ధిక ఆంక్షలను నాటో దేశాలు తీవ్రం చేశాయి. 

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో సుమారు 10 మిలియన్ ప్రజలు ఉక్రెయిన్ నుండి వదలి వెళ్లారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. తమకు సహాయాన్ని పెంచాలని నాటో దేశాలను ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలను భారీగా సహాయం చేస్తున్నాయి. 

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై నో ఫ్లై జోన్ ను ఆంక్షలను విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. మరో వైపు ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను తిరిగి ప్రారంభించింది.

ఉక్రెయిన్ , రష్యా మధ్య సోమవారం నాడు మూడో విడత చర్చలు జరగనున్నాయి. రెండు విడతలుగా జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. దీంతో మూడో విడత చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయో లేదాననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఉక్రెయిన్ కు 10 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని కూడా ఇస్తామని అమెరికా ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లోని జైటోమీర్ ప్రాంతంలో మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో క్షిపణి దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉక్రెయిన్ లోని Mariupol నగరంలో పరిస్థితి దయనీయంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆహారం, ఇతర సామాగ్రి అందుబాటులో లేవని వారు తెలిపారు.

మరో వైపు రష్యాను ఎదుర్కొనేందుకు యూకే ప్రధాని Boris Johnson ఆరు పాయింట్ల ప్రణాళికను అభివృద్ది చేశారు. చెర్నిహివ్ నివాస ప్రాంతాలపై రష్యా సైనికులు బాంబు దాడులు చేస్తున్నారని ఉక్రెయిన్ ప్రకటించింది.ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

మరోవైపు ఉక్రెయిన్ లోని రెండు అణు విద్యుత్ ప్లాంట్లను రష్యా ఆక్రమించుకొంది.. మూడో అణు విద్యుత్ ప్లాంట్ ను యుజ్నౌ‌క్రైన్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై రష్యా కన్ను పడింది. ఈ ప్లాంట్ ను కూడా రష్యా ఆక్రమించుకొనే ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని ఉక్రెయిన్ అనుమానిస్తుంది.

 మైకోలైవ్ కు ఉత్తరాన 120 కి.మీ దూరంలో ఈ అణు విద్యుత్ ప్లాంట్ ఉంది.బెలారస్ సరిహద్దులో జరిగిన రష్యా ఉక్రెయిన్ మధ్య మొదటి రెండు రౌండ్ల చర్చల వ‌ల్ల ఎలాంటి ఫ‌లితం దక్కలేదు. మూడో దఫా చర్చలు సోమవారం నాడు జరగనున్నాయి. యుద్ద ప్ర‌భావం ర‌ష్యాకు అర్థ‌మ‌యింద‌ని ఉక్రెయిన్ అభిప్రాయపడింది. తమప్రతిఘటన, అంతర్జాతీయ ఆంక్షల పట్ల ర‌ష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణను ప్రకటించిందనే అభిప్రాయాన్ని ఉక్రెయిన్ అభిప్రాయపడింది.