Asianet News TeluguAsianet News Telugu

చైనాలోని జపాన్ కంపెనీలలో 30-40 శాతం ఉద్యోగులకు కోవిడ్-19 పాజిటివ్.. ఉత్పత్తిపై ప్ర‌భావం

Beijing: చైనాలో జపాన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో 30 నుంచి 40 శాతం మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఉత్పత్తి సామర్థ్యం దాదాపు సగానికి పడిపోయింది. ఉద్యోగులతో సమన్వయం చేసుకోవడం ద్వారా కార్యకలాపాలను నిర్వహించడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ప‌లు కంపెనీలు ఉద్యోగుల‌ను ఇంటి నుంచి పని చేయాలని కోరాయి.
 

30-40 percent employees of Japanese companies in China are Covid-19 positive;Impact on production
Author
First Published Dec 27, 2022, 4:52 PM IST

Corona Virus: చైనాలో క‌రోనా వైరస్ క‌ల్లోలం రేపుతోంది. కోవిడ్-19 ఉద్ధృతి కార‌ణంగా నిత్యం ల‌క్ష‌ల్లో కొత్తగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డి అస్ప‌త్రులు రోగుల‌తో నిండిపోతున్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డి ప‌రిశ్ర‌మ‌ల‌పై క‌రోనా ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప‌లు కంపెనీల‌లో స‌గానికి పైగా సిబ్బంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డార‌ని స‌మాచారం. సంబంధిత మీడియా రిపోర్టుల ప్ర‌కారం.. చైనాలో జపాన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో 30 నుంచి 40 శాతం మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఉత్పత్తి సామర్థ్యం దాదాపు సగానికి పడిపోయింది. ఉద్యోగులతో సమన్వయం చేసుకోవడం ద్వారా కార్యకలాపాలను నిర్వహించడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ప‌లు కంపెనీలు ఉద్యోగుల‌ను ఇంటి నుంచి పని చేయాలని కోరాయి.

వివరాల్లోకెళ్తే.. చైనాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య, ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. బీజింగ్ లోని జపాన్ ఎంబసీ మాట్లాడుతూ చైనాలో పనిచేస్తున్న జపాన్ సంస్థలలోని చాలా మంది ఉద్యోగులు కోవిడ్ బారిన పడ్డారనీ, ప్రస్తుతం వారిని ఇంటి నుండి పని చేయమని అడుగుతున్నారని తెలిపింది. అదే సమయంలో, చైనాలో ఉన్న దాదాపు అన్ని ప్లాంట్లు కూడా చాలా తక్కువ మంది ఉద్యోగులతో పనిచేస్తున్నాయి.

30-40 శాతం మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్

డిసెంబర్ 16 నాటికి దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించిందని చైనాలోని కింగ్‌డావోలోని జపాన్ ఫారిన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కార్యాలయ అధిపతి యోషికావా అకినోబు తెలిపారు. ఇక్కడి జపాన్ కంపెనీల్లో 30 నుంచి 40 శాతం మంది ఉద్యోగులు కరోనా పాజిటివ్‌గా మారారని ఆయన చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యం దాదాపు సగానికి పడిపోయింది. అయితే, కంపెనీల ఉద్యోగులకు అనుగుణంగా ఏదో ఒకవిధంగా కార్యకలాపాలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాయి. గత శుక్రవారం కింగ్‌డావోలోని ఆరోగ్య అధికారులు ప్రతిరోజూ 4,90,000 నుండి 5,30,000 మందికి సోకే అవ‌కాశ‌మున్న‌ట్టు అంచనా వేసింది.

ఆందోళ‌న‌క‌రంగా ప‌రిస్థితులు.. 

మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. చైనాలో క‌రోనా విజృంభ‌ణ ఆందోళ‌న క‌లిగిస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఉన్న బీజింగ్‌కు చెందిన వైద్యుడు హోవార్డ్ బెర్న్‌స్టెయిన్ మాట్లాడుతూ, తాను ఇలాంటి ప‌రిస్థితులు ఎప్పుడూ చూడలేదని అన్నారు. రోగులు ఆయ‌న ఆసుపత్రికి నానాటికీ పెరుగుతున్న సంఖ్యలో చేరుకుంటున్నారు. వీరిలో అధికంగా వృద్ధులు, చాలా మంది కోవిడ్-న్యుమోనియా లక్షణాలతో చాలా అనారోగ్యంతో ఉన్నారని ఆయన చెప్పారు. దాదాపు చైనా అంత‌టా ఇలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

కొత్త కోవిడ్-19 ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న చైనా.. 

చైనాలో కోవిడ్ సంక్షోభం తీవ్రతరం కావడంతో, చైనా కొత్త కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొందని అధ్యక్షుడు జీ. జిన్‌పింగ్ సోమవారం అన్నారు. దేశంలోని భయంకరమైన ఆరోగ్య సంరక్షణ పరిస్థితి గురించి ఆయన మాట్లాడటం ఇదే మొదటిసారి అని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. కోవిడ్-19 వ్యాప్తి నివార‌ణ‌, ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తూ ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. కాగా, ఇదివ‌ర‌కు చైనా క‌రోనా వైరస్ వ్యాప్తిని నివారించ‌డానికి జీరో కోవిడ్ విధానాన్ని అనుస‌రిస్తూ క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేసింది. అయితే, దీనిపై ప్ర‌జ‌ల ఉనంచి తీవ్ర వ్య‌తిరేకత వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌ని చైనా దానిని అమ‌లు చేసింది. క‌రోనా కేసులు సైతం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయియి. అయితే, ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కఠినమైన జీరో-కోవిడ్ విధానాన్ని రాత్రిపూట సడలించిన తరువాత, దేశంలో కోవిడ్-19 విజృంభ‌ణ మొద‌లైంది. చాలా రోజుల త‌ర్వాత భయంకరమైన కోవిడ్ పరిస్థితిపై చైనా అధ్యక్షుడు జీ.జిన్‌పింగ్ వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి.

Follow Us:
Download App:
  • android
  • ios