Asianet News TeluguAsianet News Telugu

హెపటైటీస్ సీ వైరస్: ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్

హెపటైటీస్ సీ వైరస్ కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి దక్కింది.  
 

3 Win Nobel Medicine Award for Hepatitis C Virus Discovery lns
Author
Stockholm, First Published Oct 5, 2020, 4:11 PM IST


స్టాక్‌హోమ్: హెపటైటీస్ సీ వైరస్ కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి దక్కింది.  

అమెరికా డాక్టర్లు హార్వీ జె అల్టర్, చార్లెస్, ఎం. రైస్, బ్రిటిష్ శాస్త్రవేత్త మైఖేల్ హౌటన్  కు ఈ నోబెల్ బహుమతి లభించింది.మెడిసిన్ లేదా, ఫిజియాలజీ విభాగంలో ఈ ముగ్గురికి నోబెల్ బహుమతిని సోమవారం నాడు నోబెల్ కమిటీ ప్రకటించింది.

నోబెల్ కమిటీ హెడ్ థామస్ పెర్లమాన్ ఈ విషయాన్ని సోమవారం నాడు ప్రకటించారు. ప్రపంచంలో సుమారు 70 మిలియన్లకు పైగా హెపటైటీస్ కేసులు నమోదౌతున్నాయి. ఈ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ఈ వ్యాధి కారణంగా 4 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధి దీర్ఘకాలికమైంది. కాలేయ మంట, క్యాన్సర్ కు  ఇది ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

నోబుల్ బహుమతి  కారణంగా బంగారు పతకంతో పాటు నగదు లభిస్తోంది. ఈ నోబెల్ బహుమతి కింద 11,11,18,000  నగదును అందించనున్నారు.
124 ఏళ్ల క్రితం ఈ బహుమతి ప్రధానం ఇవ్వడాన్ని ప్రారంభించారు. స్వీడీష్ ఆవిష్కర్త  అల్ప్రెడ్ నోబెల్ ఇచ్చారు.

ఈ నెల 12 వరకు ఆరు విభాగాల్లో నోబెల్ బహుమతులను ప్రకటించనున్నారు. వైద్య విభాగాల్లో ప్రకటించిన నోబెల్ బహుమతి మొదటిది.
భౌతిక, రసాయనశాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్ధిక శాస్త్రాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ బహుమతులను ఇవ్వనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios