అమెరికాలో కాల్పుల కలకలం: ముగ్గురు మృతి

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 27, Aug 2018, 7:17 AM IST
3 Dead, Many Injured In Mass Shooting At US Video Game Tournament
Highlights

అమెరికా మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 11 మంది గాయపడ్డారు. జాక్సన్ విల్లేలోని ఉత్తర ఫ్లోరిడా సిటీలో వీడియో గేమ్ టోర్నమెంట్ పోటీదారు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 

జాక్సన్ విల్లే: అమెరికా మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 11 మంది గాయపడ్డారు. జాక్సన్ విల్లేలోని ఉత్తర ఫ్లోరిడా సిటీలో వీడియో గేమ్ టోర్నమెంట్ పోటీదారు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 

ఆ తర్వాత తనను కాల్చుకుని మరణించాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని 19 ఏళ్ల డేవిడ్ కట్జ్ గా గుర్తించినట్లు, అతను మేరీలాండ్ లోని బాల్టిమోర్ కు చెందినవాడని చెబుతున్నారు. 

సంఘటనా స్థలంలో మూడు మృతదేహాలు పడి ఉన్నాయని, ఓ మృతదేహం అనుమానితుడికి చెందిందని చెబుతున్నారు. తొమ్మండుగురు బాధితులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఏడుగురికి బుల్లెట్ గాయాలున్ాయి. 

కట్జ్ ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ లోని పోటీదారుల్లో ఒక్కడని, అతని వద్ద ఓ హ్యాండ్ గన్ ఉందని చెబుతున్నారు. చికాగో పిజ్జా రెస్టారెంట్ లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

 

loader