Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. ఇప్పటివరకు నెమ్మదిగా ముందుకు సాగుతున్న రష్యా బలగాలు.. పుతిన్ ఆదేశాలతో మరింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. అయితే, రష్యాకు ధీటైన సమాధామిస్తూ.. ఉక్రెయిన్ బలగాలు ముందుకు సాగుతున్నాయి.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, రష్యా బలగాలకు ఉక్రెయిన్ ధీటైన సమాధానంతో ముందుకు సాగుతోంది.
రష్యా దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ బలగాలు తమదైన తరహాలో ఆ దాడులను ఎదుర్కొంటూ.. రష్యాకు అడ్డుకట్టవేసేలా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటివరకూ 250 రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేశామనీ, 10,000 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. అలాగే, 33 విమానాలు, 37 రష్యన్ హెలికాఫ్టర్లను కూల్చామని వెల్లడించింది. 939 సాయుధ క్యారియర్లను ధ్వంసం చేశామని, 60 ఫ్యూయల్ ట్యాంకులను పేల్చివేశామని, 18 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్‌ను ధ్వంసం చేశామని పేర్కొంది.
రష్యన్ పంత్సీర్ S-1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఉక్రేనియన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిని నిర్వహించడానికి.. ఉపగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
అలాగే, రష్యన్ Su-25 ని యుద్ధ విమానాన్ని Volnovakha సమీపంలో ఉక్రెయిన్ బలగాలు కాల్చివేశాయి.
యూరప్ లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. మొత్తం 6 అణు రియాక్టర్లు ఉండగా, అక్కడ ఒక దాంట్లో మంటలు చెలరేగాయి. అయితే, వెంటనే ఉక్రెయిన్ బలగాలు ఆ మంటలను ఆర్పి.. అతిపెద్ద ప్రమాదాన్ని తప్పించాయి. అయితే, ప్రస్తుతం ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను రరష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని సమాచారం. ఇదే విషయం గురించి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ.. జపాన్ ప్రధాని తో మాట్లాడారు.
