ఒకే కాన్పులో ఏడుగురు బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ వింత సంఘటన ఇరాక్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇరాక్ కి చెందిన 25ఏళ్ల యువతి ఆదివారం దియాలీ ప్రావిన్స్ లోని ఓ ఆస్పత్రిలో ఏడుగురు సంతానానికి జన్మనిచ్చింది. వారిలో ఆరుగురు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు.

ఆమెకు నార్మల్ డెలివరీలోనే ఈ ఏడుగురు జన్మించడం విశేషం. పుట్టిన ఏడుగురు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు. తల్లి ఆరోగ్యం కూడా మెరుగ్గానే ఉందని చెప్పారు.అంతకముందు మహిళకు ముగ్గురు సంతానం ఉండగా.. ఇప్పుడు మరో ఏడుగురు మొత్తం కలిపి పదిమంది అయ్యారు. ఈ విషయంపట్ల మహిళ భర్త సంతోషం వ్యక్తం చేశారు.

ఒకే కాన్పులో ఏడుగురికి జన్మనివ్వడం ఇరాక్ లో ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు చెప్పారు.